ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు:
SBI నెట్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్ లేదా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు చాలా మంది టెన్షన్ పడతారు, కానీ అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే కూర్చొని సులభంగా రికవర్ చేసుకోవచ్చు. అయితే, దీని కోసం కొన్ని ముఖ్యమైన సమాచారం ముందుగా సిద్ధంగా ఉండాలి. మొదటగా, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తప్పనిసరిగా యాక్టివ్‌లో ఉండాలి, ఎందుకంటే రికవరీ ప్రాసెస్‌లో OTPలు అదే నంబర్‌కి వస్తాయి. అలాగే మీ వద్ద SBI ATM/డెబిట్ కార్డ్ ఉండాలి – దీనిలోని కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్, మరియు ATM PIN అవసరం అవుతుంది. మీరు ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కి రిజిస్టర్ అయి ఉండాలి,
కొత్తగా activation చేయాలంటే ఈ ప్రాసెస్ వర్క్ చేయదు. పాస్వర్డ్ రీసెట్కి మీ ఖాతా నంబర్, మరియు బ్రాంచ్‌తో రిజిస్టర్ చేసిన వివరాలు గుర్తుండాలి. ఈ రికవరీ ప్రక్రియను మీరు SBI అధికారిక వెబ్సైట్ అయిన onlinesbi.com లేదా SBI YONO యాప్ ద్వారా చేయొచ్చు. అంతేగాకుండా, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, ఎందుకంటే మధ్యలో నెట్వర్క్ తేడా వచ్చినా OTP ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ అన్ని అవసరాలు సిద్ధంగా ఉంటే, మీరు ఏ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేకుండా, మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారానే మీ SBI నెట్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్ మరియు పాస్‌వర్డ్‌ను సురక్షితంగా రీసెట్ చేసుకోవచ్చు.
Table of Contents
SBI యూజర్‌నేమ్ & పాస్వర్డ్ రికవరీ చేయడం ఎలా?
SBI నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌కు వెళ్ళండి:
🔗 https://retail.onlinesbi.sbi
A. యూజర్ నేమ్ మర్చిపోయినట్లయితే:

- హోమ్‌పేజీలో “Forgot Username?” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- ఈ వివరాలు నమోదు చేయండి:
- CIF నంబర్ (పాస్‌బుక్ లేదా అకౌంట్ స్టేట్మెంట్లో ఉంటుంది)
- దేశం (India)
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్
- క్యాప్చా కోడ్
- CIF నంబర్ (పాస్‌బుక్ లేదా అకౌంట్ స్టేట్మెంట్లో ఉంటుంది)
- “Submit” Button పై క్లిక్ చేయండి.
- మీ యూజర్ నేమ్ మీ మొబైల్‌కు SMS ద్వారా వస్తుంది.
B. పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే:
- “Forgot Login Password?” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- “Forgot my login password” ఎంచుకుని Next క్లిక్ చేయండి.
- ఇప్పుడు రెండు రకాల Options ఉంటాయి:
- ATM కార్డ్ ద్వారా
- ప్రొఫైల్ పాస్వర్డ్ ద్వారా
- ATM కార్డ్ ద్వారా
- ఈ వివరాలు నమోదు చేయాలి:
- యూజర్ నేమ్
- అకౌంట్ నంబర్
- పుట్టిన తేది
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్
- యూజర్ నేమ్
- ఒక OTP మీ ఫోన్‌కు వస్తుంది — అది నమోదు చేయండి.
- కొత్త పాస్వర్డ్ సెట్ చేయండి → Submit క్లిక్ చేయండి.
YONO SBI యాప్ ద్వారా కూడా రికవర్ చేయవచ్చు:
- యాప్ ఓపెన్ చేసి Login → Trouble Logging In → Forgot Username/Password పై ట్యాప్ చేయండి.
- పై వివరాలు ఇచ్చిన విధంగా కొనసాగించండి.
అవసరమైనవి:
- CIF నంబర్ లేదా యూజర్ నేమ్
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్
- ATM కార్డ్ వివరాలు లేదా ప్రొఫైల్ పాస్వర్డ్
మొత్తానికి, SBI నెట్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్ లేదా పాస్వర్డ్ మర్చిపోతే ఇది పెద్ద సమస్యగా అనిపించాల్సిన పని లేదు. మీరు మధ్య మధ్యలో ఒకసారి మీ login డీటెయిల్స్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉంటే, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రావు. ఇకపై ఇలాంటివి ఎదురైతే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఈ బ్లాగ్‌లో చెప్పిన స్టెప్స్‌ని ఫాలో అవండి – మీ బ్యాంకింగ్ మళ్లీ మొదలవుతుంది… అవును, అంత సింపుల్!
ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గ వీడియో రూపం లో కావాలంటే ఈ క్రింది వీడియో చూడండి:
















