Table of Contents
- 1 మొబైల్ ఫోన్ స్లో అవ్వడానికి గల కారణాలు మరియు పరిష్కార మార్గాలు :-
- 2 మొబైల్ ఫోన్ స్లో అవ్వడానికి గల ముఖ్యమైన కారణాలు :-
- 3 1. RAM ఎక్కువగా వాడటం
- 4 2. స్టోరేజ్ (Storage) నిండిపోవడం
- 5 3. పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడటం
- 6 4. వైరస్ లేదా మాల్వేర్ ఉండటం
- 7 5. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ ఎక్కువగా పనిచేయడం
- 8 6. అనవసరమైన Apps మరియు Widgets
- 9 7. Old Processor లేదా Hardware
- 10 ✅ పరిష్కార మార్గాలు :–
- 11 Latest Updates
మొబైల్ ఫోన్ స్లో అవ్వడానికి గల కారణాలు మరియు పరిష్కార మార్గాలు :-
ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అయిపోయింది. కానీ కొన్నాళ్లకు వాడిన తర్వాత ఫోన్ స్లో అవ్వడం, హ్యాంగ్ అవ్వడం చాలామందికి తలనొప్పిగా మారుతుంది. మీరు కొత్త ఫోన్ కొన్నప్పుడే స్పీడ్‌గా పనిచేస్తుంది. కానీ క్రమంగా వాడుతున్న కొద్దీ పనితీరు తగ్గిపోతుంది. దానికి గల కారణాలు ఏంటో, వాటికి సింపుల్ పరిష్కారాలు ఏమిటో చూద్దాం.
మొబైల్ ఫోన్ స్లో అవ్వడానికి గల ముఖ్యమైన కారణాలు :-
1. RAM ఎక్కువగా వాడటం

ఫోన్లో ఎక్కువ యాప్స్ ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల RAM పై ఒత్తిడి పెరుగుతుంది, అలాంటప్పుడు మనం ఎప్పటికప్పుడు ఓపెన్ చేసిన యాప్స్ క్లోజ్ చేస్తూ ఉండాలి. మీరు ఎక్కువ రోజులు వాడని యాప్స్ uninstall చేస్తూ ఉండాలి, Uninstall చేసే సమయం లో యాప్స్ యొక్క Background డేటా ప్రొపర్ గా క్లియర్ Cache మరియు Clear Data చేసి, ఆ యాప్ కు ఇచ్చిన Permissions పూర్తిగా Disableచేసిన తర్వాత Uninstall చేయాలి. ఇలా చేసినట్లైతే మీ మొబైల్ లో ఉన్నటువంటి RAM మీద భారం పడకుండా ఉంటుంది, అలాగే మొబైల్ ఫాస్ట్ గా రన్ అవుతుంది.
2. స్టోరేజ్ (Storage) నిండిపోవడం

ఫోన్ మెమొరీ (Internal Storage) పూర్తి కావడం వల్ల పనితీరు తగ్గుతుంది. మీ మొబైల్ లో ఉన్నటువంటి అవసరం లేని ఫైళ్లను, ఫోటోలను, వీడియోలను డిలీట్ చేయాలి లేదా క్లౌడ్‌కు అప్లోడ్ చేయడం వలన Storage ఫ్రీ అవుతుంది. మీ మొబైల్ లో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి అందులో ఉన్న పాత వీడియోస్ ఫొటోస్ చెక్ చేసి డిలీట్ చేయడం వలన మీ మొబైల్ లో ఉన్న స్టోరేజ్ ఫ్రీ అవుతుంది, మెమరీ ఫ్రీ ఉన్నట్లయితే మొబైల్ కూడా స్లో అవ్వకుండా ఫాస్ట్ గా రన్ అవుతుంది.
3. పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడటం

మీ మొబైల్ కు సంబందించిన ఆండ్రాయిడ్ వెర్షన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉండాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయక పోవడం వలన కూడా మొబైల్ స్లో అవుతుంది, Software Update చేయాలంటే మీ మొబైల్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి About Device or System & Update అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడినుండి మీ మొబైల్ కు Security Updates లేదా Software Update వచ్చింటే ప్రోపర్ గా Update చేస్తూ ఉండండి, ఇలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉండటం వలన మీ మొబైల్ ఫాస్ట్ గా రన్ అవుతుంది.
4. వైరస్ లేదా మాల్వేర్ ఉండటం
హానికరమైన యాప్స్ ద్వారా వైరస్లు రాగలవు, ఇవి ఫోన్ వేగాన్ని తగ్గిస్తాయి. నమ్మకమైన యాంటీవైరస్ యాప్ ద్వారా స్కాన్ చేయండి. మనకు తెలియకుండానే కొన్ని unsafe websites నుంచి apps డౌన్లోడ్ చేసుకోవడం లేదా అనుమానాస్పద లింక్స్ ఓపెన్ చేయడం వల్ల ఫోన్లో వైరస్ లేదా మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి ఫోన్ పనితీరును తగ్గించడమే కాకుండా పర్సనల్ డేటా లీక్ అయ్యే ప్రమాదం కూడా కలిగిస్తాయి. Google Play Store లేదా Apple App Store నుంచి మాత్రమే యాప్‌లు డౌన్లోడ్ చేయాలి, అనుమానాస్పద లింక్స్, పాప్-అప్ Ads క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి, పరిస్థితి చాలా సీరియస్ అయితే, ఫోన్‌ను Factory Reset చేసి మళ్లీ సెటప్ చేయాలి.
5. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ ఎక్కువగా పనిచేయడం
కొన్ని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొనసాగుతూ బ్యాటరీ, RAM వాడతాయి. “Battery Usage” సెట్టింగ్స్‌లో చూసి అనవసరమైన యాప్స్‌కి పరిమితి పెట్టండి. మనలో చాలామంది యాప్ ఓపెన్ చేసి వాడిన తర్వాత డైరెక్ట్‌గా హోమ్ స్క్రీన్‌కి వెళ్ళిపోతారు, కానీ ఆ యాప్‌ను ప్రాపర్‌గా క్లోజ్ చేయరు. ఇలా చేస్తే అవి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఇలా చేయడం వలన RAM ఎక్కువగా వినియోగించబడుతుంది, బ్యాటరీ ఫాస్ట్‌గా డిశ్చార్జ్ అవుతుంది, మరియు ఫోన్ హీట్ కూడా అవుతుంది, మొత్తం పనితీరు (Performance) బాగా తగ్గిపోతుంది. ఇలా చేయండి, ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Battery → Background Activity లేదా App Management ఆప్షన్లో అవసరం లేని యాప్స్‌కి Restrict Background Usage ఇవ్వాలి, రెగ్యులర్‌గా ఫోన్ రీస్టార్ట్ చేయాలి – దీని వల్ల RAM రిఫ్రెష్ అవుతుంది. Battery Saver / Performance Mode ఆన్ చేస్తే unnecessary బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి.
6. అనవసరమైన Apps మరియు Widgets
Home Screen మీద ఎక్కువ గా widgets, live wallpapers వాడటం వలన కూడా ఫోన్ పనితీరు పై ప్రభావం పడుతుంది, అందు వలన హోమ్‌స్క్రీన్‌ను సాధారణంగా ఉంచడం మంచిది.
7. Old Processor లేదా Hardware
ఫోన్ వయసు పెరగడంతో హార్డ్‌వేర్ మద్దతు ఇవ్వడం తగ్గుతుంది. ఈ పరిస్థితిలో ఫోన్ అప్‌గ్రేడ్ చేయడం ఉత్తమ పరిష్కారం. మీ మొబైల్ లో సాఫ్ట్వేర్ updates మరియు సెక్యూరిటీ updates రావడం బంద్ అయింటే తప్పకుండ మీరు తప్పకుండ కొత్త మొబైల్ తీసుకోవడం మంచిది.
✅ పరిష్కార మార్గాలు :–
Cache Data క్లీన్ చేయండి
Settings > Storage > Cached data > Clear cached data
- అవసరం లేని యాప్స్ Clear Data, Clear Cache చేసి Uninstall చేయడం
- Restart చేయడం – వారానికి ఒక్కసారి అయినా
- ఫోన్‌ను Factory Reset చేయడం (Backup తీసుకోవాలి!)

పైన చెప్పిన విదంగా పాటిస్తే మీ మొబైల్ వేగం గణనీయంగా మెరుగవుతుంది, మరియు బాటరీ Backup కూడా పెరుగుతుంది.
ఈ సెట్టింగ్స్ అన్ని చేసిన తర్వాత మీ మొబైల్ లో తేడా కనిపించిందా లేదా! ఇంకా ఏమయినా సందేహాలు ఉంటె కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చుడండి …















