How to Set UPI PIN Without Debit Card – Full Guide – Telugu

R V Prasad

By R V Prasad

Updated On:

upi pin set without debit card

Join Telegram

Join

Join Whatsapp

Join

UPI పేమెంట్స్ యాప్‌ల వల్ల డబ్బుల లావాదేవీలు చాలా ఈజీ అయ్యాయి. కానీ UPI PIN సెట్ చేసేటప్పుడు డెబిట్ కార్డు అవసరం అని అనుకునే వాళ్లు చాలామందే ఉంటారు. అయితే ఇప్పుడిక ఆ అవసరం లేదు! మీరు డెబిట్ కార్డ్ లేకుండా కూడా UPI PIN సెట్ చేసుకునే సౌకర్యం కొన్ని బ్యాంక్‌లతో పాటు, కొన్ని పేమెంట్ యాప్‌ల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ బ్లాగ్‌లో డెబిట్ కార్డ్ లేకుండా కూడా ఎలా సులభంగా UPI PIN సెట్ చేయాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ పద్ధతి ఇప్పుడు చాలా బ్యాంకులకు అందుబాటులో ఉంది మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దీనిని సెప్టెంబర్ 2021లో ప్రవేశ పెట్టింది.

ముఖ్యమైనవి:

  • మీ మొబైల్ నంబర్ మీ బ్యాంక్ ఖాతాకు మరియు మీ ఆధార్ నంబర్‌కు లింక్ అయ్యి ఉండాలి.
  • మీ మొబైల్ నంబర్‌లో SMS పంపడానికి తగిన బ్యాలెన్స్ ఉండాలి.

UPI పిన్ సెట్ చేసే విధానం (ఆధార్ ఉపయోగించి):

  1. మీ UPI Appను Open చేయండి: మీరు ఉపయోగించే ఏదైనా UPI Enabled యాప్. (ఉదాహరణకు :- PhonePe, Paytm, Google Pay, BHIM) వీటిలో ఏ యాప్ అయినా ఉపయోగించవచ్చు.
  1. Bank Account ను ADD చేయండి or ఎంచుకోండి:
    • కొత్త Bank Account Add చెయ్యాల్సి వస్తే, ఆ Choiceను ఎంచుకుని మీ బ్యాంక్‌ను ఎంచుకోండి.
    • మీరు ఇప్పటికే Bank Account ను లింక్ చేసి ఉంటే, మీరు UPI పిన్ సెట్ చేయాలనుకుంటున్న Bank Account ను ఎంచుకోండి.
  1. UPI పిన్ సెట్/రీసెట్ ఎంపికను ఎంచుకోండి:  Bank Account వివరాల్లో “Set UPI PIN” లేదా “Reset UPI PIN” Option ను కనుగొని దానిపై నొక్కండి.
  1. “Aadhaar card” ఎంపికను ఎంచుకోండి: సాధారణంగా ఇక్కడ డెబిట్ కార్డ్ వివరాలను అడుగుతుంది. కానీ డెబిట్ కార్డ్ లేని వారికి, “Aadhaar card” (ఆధార్ కార్డ్) ఎంపికను ఎంచుకోవాలి. (ఈ ఎంపిక అన్ని బ్యాంకులకూ అందుబాటులో ఉండకపోవచ్చు, మీ బ్యాంక్ దీన్ని సపోర్ట్ చేస్తుందో లేదో చూసుకోవాలి).
  1. ఆధార్ నంబర్ మొదటి 6 అంకెలను నమోదు చేయండి: మీ ఆధార్ నంబర్ మొదటి 6 అంకెలను నమోదు చేయండి.
  1. OTP లను Confirm చెయ్యండి  :
    • మీ బ్యాంక్ నుండి మీ Registered మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. ఆ OTP ని ఎంటర్ చేయండి.
    • అలాగే, UIDAI (ఆధార్) నుండి కూడా మీ  Registered మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. ఆ OTP ని కూడా ఎంటర్ చేయండి.
  2. కొత్త UPI పిన్‌ను సెట్ చేయండి: రెండు OTP ల confirmation విజయవంతం అయిన తర్వాత, మీరు మీకు నచ్చిన 4 లేదా 6 అంకెల UPI పిన్‌ను సెట్ చేసుకోవచ్చు. పిన్‌ను సురక్షితంగా ఎంచుకోండి.
  1. పిన్‌ను Confirm చేయండి : సెట్ చేసిన పిన్‌ను మరోసారి ఎంటర్ చేసి Confirm చేయండి. ఇలా మీరు Successful గా UPI PIN సెట్ చేయొచ్చు.

మొత్తానికి, డెబిట్ కార్డ్ లేకపోయినా UPI PIN సెట్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ అయింది. సరైన యాప్, బ్యాంక్‌ డీటెయిల్స్ ఉంటే మీరు మినిమమ్ స్టెప్స్‌తో PIN సెట్ చేసి, ఏ సమయంలోనైనా సురక్షితంగా లావాదేవీలు చేయొచ్చు. కాబట్టి ఇంకా మీరు PIN సెట్ చేయకుండా ఉంటె, ఈ గైడ్‌ని ఫాలో అవండి, డిజిటల్ పేమెంట్స్‌లో మీ మొదటి అడుగు వేయండి!

ఈ Steps పూర్తయిన తర్వాత, మీరు మీ డెబిట్ కార్డ్ లేకుండానే మీ బ్యాంక్ ఖాతాకు UPI పిన్‌ను విజయవంతంగా సెట్ చేసుకుంటారు.

R V Prasad

R V Prasad

R V Prasad is the founder and editor of rvprasadtech.com & @rvprasadtech YouTube Channel. He writes daily about Trending Tech New Updates, Railway Updates and trending news in Telugu. With a strong focus on authenticity and public needs, his mission is to make useful information easily available to every reader.

Leave a Comment