ఇంట్లో 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారా? అయితే ఇది మీకు చాలా ముఖ్యమైన సమాచారం. ఇప్పుడు Sr Citizen Card కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
మనమే సొంతంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సదుపాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది.
ముఖ్యంగా AP Seva Portal ద్వారా ఈ ప్రక్రియ చాలా ఈజీగా ఉంటుంది.
అప్లై చేసిన వెంటనే Senior Citizen Card Instant గా Generate అవుతుంది. PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకుని లామినేషన్ చేయించుకుంటే సరిపోతుంది.
Table of Contents
- 1 Senior Citizen Card అంటే ఏమిటి?
- 2 Sr Citizen Card ఎందుకు అవసరం?
- 3 AP Seva Portal ద్వారా Senior Citizen Card Apply చేసే విధానం
- 4 AP Seva Portal లో మొదటిసారి లాగిన్ అవుతున్నారా? ఇలా రిజిస్ట్రేషన్ చేయండి
- 5 Senior Citizen Card Apply – పూర్తి ప్రక్రియ
- 6 Sr Citizen Card అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి?
- 7 అడ్రస్ & బేసిక్ డీటెయిల్స్
- 8 ఎమర్జెన్సీ & ఆథెంటికేషన్ వివరాలు
- 9 డాక్యుమెంట్స్ అప్లోడ్ (చాలా ముఖ్యము)
- 10 Payment? పూర్తిగా ఫ్రీ!
- 11 Sr Citizen Card Download & Print
- 12 Sr Citizen Card ఎవరు తప్పకుండా తీసుకోవాలి?
- 13 చివరిగా…
- 14 Latest Updates
Senior Citizen Card అంటే ఏమిటి?
Senior Citizen Card అంటే 60 ఏళ్లు నిండిన వారందరికీ ప్రభుత్వం జారీ చేసే అధికారిక గుర్తింపు కార్డు.
ఈ Sr Citizen Card ద్వారా సీనియర్ సిటిజన్లకు అనేక రకాల రాయితీలు, సౌకర్యాలు లభిస్తాయి.
ఇది పూర్తిగా ఫ్రీ, ఆన్లైన్ లో అప్లై చేస్తే Instant గా Generate అయి వస్తుంది.
Sr Citizen Card ఎందుకు అవసరం?
చాలామందికి ఉండే డౌట్ ఇదే, ఈ కార్డు ఎందుకు అవసరం?
Sr Citizen Card ఉపయోగాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా:
- బస్ జర్నీ చేసే సమయంలో టికెట్ చార్జీల్లో డిస్కౌంట్
- ట్రైన్ జర్నీలో సీనియర్ సిటిజన్ రాయితీలు
- హాస్పిటల్స్‌లో ప్రత్యేక కౌంటర్లు, ప్రాధాన్యత
- ప్రభుత్వ పథకాలు, సేవల్లో సులభంగా అర్హత నిరూపణ
ఇకపై ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా, చాలా చోట్ల Sr Citizen Card ఒక్కటే సరిపోతుంది.
AP Seva Portal ద్వారా Senior Citizen Card Apply చేసే విధానం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు AP Seva Portal లో సులభంగా Senior Citizen Card Online ద్వారా Apply చేసుకోవచ్చు.
ఒకవేళ ఆన్‌లైన్ చేయలేని పరిస్థితిలో ఉంటే, మీ గ్రామ / వార్డు సచివాలయం వెళ్లి కూడా అప్లై చేసుకోవచ్చు.
AP Seva Portal లో మొదటిసారి లాగిన్ అవుతున్నారా? ఇలా రిజిస్ట్రేషన్ చేయండి
మొదటిసారి AP Seva Portal ఉపయోగిస్తున్నట్లయితే, ముందుగా రిజిస్ట్రేషన్ అవసరం.
రిజిస్ట్రేషన్ స్టెప్స్:
- AP Seva Portal ఓపెన్ చేయండి
- Login ఆప్షన్‌పై కర్సర్ పెట్టి
- Citizen Login క్లిక్ చేయండి
- మీ Email ID, పేరు, ఆధార్ నంబర్ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి
- రిజిస్ట్రేషన్ సమయంలో మీ మెయిల్‌కు వచ్చిన OTP ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి
సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత, మీ పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలు ఆటోమేటిక్‌గా కనిపిస్తాయి.
Senior Citizen Card Apply – పూర్తి ప్రక్రియ
Step 1:
హోమ్ పేజీలో
Women, Children, Disabled & Senior Citizen అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Step 2:
అందులో Senior Citizen Card ను ఎంపిక చేయండి.
ఇప్పటికే కార్డు అప్లై చేసి ఉంటే, కరెక్షన్లు చేయాలంటే Correction of Senior Citizen Card ఆప్షన్ ఉపయోగించవచ్చు.
Sr Citizen Card అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి?
Step 3:
- 60 ఏళ్లు పైబడిన వ్యక్తి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి
- Pre-Fill క్లిక్ చేస్తే, పేరు, DOB ఆటోమేటిక్‌గా వస్తాయి
Step 4:
- Father Name (బ్లాంక్ ఉంటే) ఎంటర్ చేయండి
- Religion, Qualification, Marital Status సెలెక్ట్ చేయండి
Step 5:
- ఆధార్‌కు లింక్ అయిన Mobile Number ఎంటర్ చేసి
- Verify క్లిక్ చేయండి
- వచ్చిన OTP ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి
అదే నంబర్ WhatsApp నంబర్ అయితే Yes సెలెక్ట్ చేయవచ్చు.
అడ్రస్ & బేసిక్ డీటెయిల్స్
- Permanent Address ఆటోమేటిక్‌గా వస్తుంది
- ఏమైనా బ్లాంక్స్ ఉంటే ఫిల్ చేయాలి
- Permanent & Present Address ఒకటే అయితే చెక్‌బాక్స్ టిక్ చేయండి
తర్వాత Continue క్లిక్ చేయండి.
ఎమర్జెన్సీ & ఆథెంటికేషన్ వివరాలు
- Blood Group సెలెక్ట్ చేయండి
- Contact Number ఎంటర్ చేయండి
- Emergency Contact Person Name & Number ఇవ్వండి
Authentication:
- OTP Authentication సెలెక్ట్ చేయండి
- UIDAI డిక్లరేషన్ చదివి చెక్‌బాక్స్ టిక్ చేయండి
- Send OTP → OTP ఎంటర్ చేసి Authenticate చేయండి
Authentication Success అయిన తర్వాత, వివరాలు తెలుగులో కనిపిస్తాయి.
డాక్యుమెంట్స్ అప్లోడ్ (చాలా ముఖ్యము)
ఇక్కడ రెండు డాక్యుమెంట్స్ తప్పనిసరి:
- Passport Size Photo
- 640×480 రిజల్యూషన్
- JPG ఫార్మాట్
- Aadhaar Card
- PDF ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాలి
ఫోటో & ఆధార్ అప్లోడ్ చేసిన తర్వాత Confirm క్లిక్ చేయండి.
Payment? పూర్తిగా ఫ్రీ!
చివరిగా Show Payment క్లిక్ చేస్తే, Payment Amount: ₹0 అంటే పూర్తిగా FREE
OK క్లిక్ చేసిన వెంటనే… Sr Citizen Card ఇన్‌స్టంట్‌గా జనరేట్ అవుతుంది
Sr Citizen Card Download & Print
- Continue క్లిక్ చేయండి
- Payment Receipt (₹0) కనిపిస్తుంది
- Print Certificate క్లిక్ చేస్తే
- PDF ఫార్మాట్‌లో Sr Citizen Card వస్తుంది
- డౌన్‌లోడ్ చేయండి
- ప్రింట్ తీసుకోండి
- లామినేషన్ చేయించుకోండి
అంతే… మీ Senior Citizen Card Apply Online ప్రక్రియ పూర్తయింది.
Sr Citizen Card ఎవరు తప్పకుండా తీసుకోవాలి?
- తల్లిదండ్రులు
- తాత, నానమ్మ
- 60 ఏళ్లు దాటిన కుటుంబ సభ్యులు
వాళ్లందరికీ Sr Citizen Card ఉండటం చాలా అవసరం.
చివరిగా…
ఇప్పుడు Senior Citizen Card Apply చేయడం చాలా ఈజీ.
ఏపీ సేవ పోర్టల్ ద్వారా:
- ఫ్రీగా
- ఇంట్లో నుంచే
- ఇన్‌స్టంట్‌గా
మీ ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ఈ సమాచారాన్ని తప్పకుండా ఉపయోగించండి.
వాళ్లకు ఇది రేపు ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి.
పూర్తి సమాచారం వీడియో రూపం లో కావాలనుకుంటే ఈ క్రింద వీడియో క్లిక్ చేసి చుడండి.















