🔥 డీఎల్, ఆర్సీలో మొబైల్ నెంబర్ తప్పనిసరిగా అప్డేట్ చేయండి! – ఆధార్ ఆధారిత సేవలకు ఇది చాల ఇంపార్టెంట్!
మీ డ్రైవింగ్ లైసెన్స్ (DL) లేదా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసారా? చేయలేదా? అయితే ఇది చదవాల్సిందే! ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆధార్ ఆధారిత ఆటోమెటెడ్ వాహన సేవల కోసం, మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కరెక్ట్‌గా ఉండటం చాలా కీలకం. ఇప్పుడు RTOలు కొత్త అప్డేట్తో ముందుకొస్తున్నాయి DL, RCలతో లింక్ చేసిన మొబైల్ నెంబర్ తప్పనిసరి కాబోతోంది.
ఈ మెసేజ్ మీకు RTO నుంచి లేదా రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్లయితే, దాన్ని తక్కువగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మీ రోడ్లైఫ్ను భవిష్యత్తులో మానవ సహాయం లేకుండానే సులభంగా చేసేందుకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు అని అనుకోవాలి.
Table of Contents
DL, RCలో మొబైల్ నెంబర్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్?
పెరుగుతున్న డిజిటలైజేషన్ వల్ల చాలా ప్రభుత్వ సేవలు ఇప్పుడు ఆధార్ ఆధారిత ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, పర్మిట్ల అప్లికేషన్లు, ట్రాన్స్ఫర్, మరియు నూతన లైసెన్స్ జారీ వంటి అనేక సేవలు ఉన్నాయి. ఈ సర్వీసులను మీరు ఆన్లైన్లో పొందాలంటే, మీ ఆధార్ నంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి.
అలానే, మీ DL లేదా RC డేటాలో కూడ మీ కరెక్ట్ మొబైల్ నెంబర్ ఉండకపోతే, ఒటీపీ పొందడం కష్టమవుతుంది, సర్వీసులు నిలిచిపోతాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఆధార్ ఆధారిత వాహన సేవలు అందించేందుకు మొబైల్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి అయింది.
మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?
ఈ మధ్య చాలా మంది RTO అధికారిక నంబర్ నుంచి ఈ విధమైన మెసేజ్ అందుకున్నారు:
“Important: Please update your Mobile number in Driving License / RC to avail Aadhaar authentication based contactless services in future. Visit parivahan.gov.in.“
ఇది ఎలాంటి స్కామ్ కాదు. ఇది అధికారికంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పరివాహన్ వెబ్సైట్ ద్వారా పంపబడిన నోటిఫికేషన్. ఈ ప్రక్రియ పూర్తిగా సురక్షితమైనది.
అప్డేట్ చేసే విధానం? Step-by-step గైడ్
మీరు మీ DL లేదా RCకి మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం:
- Parivahan Website ను ఓపెన్ చేయండి
- మెనూలో ‘Update Mobile Number’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- మీ స్టేట్ ఎంపిక చేయండి
- Driving License Number లేదా RC Number ఎంటర్ చేయండి
- పాత మొబైల్ నెంబర్ (ఉంటే) లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
- కొత్త మొబైల్ నెంబర్ నమోదు చేసి, OTP ద్వారా వెరిఫై చేయండి
- సబ్మిట్ చేసిన తర్వాత, మీ డేటా అప్డేట్ అవుతుంది
👉 కొన్ని రాష్ట్రాల్లో ఈ సేవలకు నామమాత్ర ఫీజు ఉండవచ్చు (₹10 – ₹50 మధ్య).
అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది?
మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేయకపోతే:
- మీరు ఆధార్ ఆధారిత Contactless Driving License, RC సర్వీసులు వాడలేరు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌కు ఒటీపీ రాకపోవచ్చు.
- భవిష్యత్తులో ఆన్లైన్ సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉండొచ్చు.
సకాలంలో DL రిన్యువల్, డూప్లికేట్, అడ్రస్ మార్పు వంటి వాటికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆధార్‌తో పూర్తిస్థాయి డ్రైవింగ్ సేవలు future లో రావొచ్చు
సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే “Contactless Driving License Services” అనే ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్, రిన్యువల్, పర్మిట్ అప్లికేషన్, RC ట్రాన్స్ఫర్ – అన్నీ ఆధార్ ఆధారంగా ఓటీపీ వెరిఫికేషన్ ద్వారానే చేస్తారు. అంటే ఇక లాంగ్ క్యూలు ఉండవు, బ్రోకర్లు అవసరం ఉండదు!
కాబట్టి ఇప్పుడే ముందుగానే మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటే, రేపటి డిజిటల్ డ్రైవింగ్ ప్రపంచానికి మీరు సిద్ధమే!
చివరిగా చెప్పాలంటే, DL లేదా RCలో మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం ఇక ‘ఐచ్ఛికం’ కాదు – అది అవసరమైంది. ఆధార్ ఆధారిత డిజిటల్ సేవలు ఇప్పటికే చాలా రంగాల్లో ప్రవేశించాయి. రాబోయే రోజుల్లో డ్రైవింగ్, వాహన సంబంధిత సేవలన్నీ కూడా పూర్తిగా ఆధార్-వెరిఫైడ్ ఓటీపీ మోడల్‌కి మారబోతున్నాయి. మీరు ఇప్పుడు తీసుకునే చిన్న చర్య – అంటే మొబైల్ నెంబర్ అప్డేట్ – రేపటి పెద్ద సమస్యలను దూరం చేస్తుంది.📌 ఇంకెందుకు ఆలస్యం? parivahan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి మీ మొబైల్ నెంబర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోండి!
డ్రైవింగ్ లైసెన్స్ మరియు RC లో మొబైల్ నెంబర్ update చేసుకునే విధానం ఈ క్రింది వీడియో లో కూడా వివరించడం జరిగింది, కావాలనుకున్న వారు ఈ వీడియో చుడండి.
















Sir, My driving licence details are not fecthing from https://sarathi.parivahan.gov.in/ , it has issued in 2007 at hyderabad. but it is showing at RTA M wallet of Telangana government app.
Pls let me know the procedure how fetch the details from https://sarathi.parivahan.gov.in