Table of Contents
RailOne App Registration Process :–
రైల్వే టిక్కెట్లు సులభంగా బుక్ చేసుకునేందుకు తాజాగా వచ్చిన RailOne యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం, లాగిన్ అవ్వడం చాలా సింపుల్ అండ్ ఫాస్ట్. ప్రత్యేకంగా IRCTC అకౌంట్ లేకపోయినా RailOne ద్వారా సులభంగా రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ బ్లాగ్‌లో RailOne యాప్‌లో రిజిస్ట్రేషన్, లాగిన్ ప్రక్రియ ఎలా చేయాలో స్టెప్-బై-స్టెప్ గైడ్‌గా తెలుసుకుందాం.
- App Download చేసుకోండి: ముందుగా, మీ Android లేదా iOS(iphone) మొబైల్లో Google Play Store లేదా App Store నుండి “RailOne” App ను డౌన్లోడ్ చేసి Install చేయండి.

- యాప్ ఓపెన్ చేయండి: యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత, దాన్ని ఓపెన్ చేయండి. లొకేషన్ పర్మిషన్ అడిగితే ON చేయండి.
- రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోండి: యాప్ ఓపెన్ చేయగానే మీకు “Login”, “న్యూ యూజర్ రిజిస్ట్రేషన్” (New User Registration), మరియు “గెస్ట్” (Guest) అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు కొత్త యూజర్ కాబట్టి, “న్యూ యూజర్ రిజిస్ట్రేషన్” ఎంచుకోండి.
- మొబైల్ నంబర్ నమోదు చేయండి: “న్యూ యూజర్ రిజిస్ట్రేషన్” పై Click చేసిన తర్వాత, మీకు IRCTC Rail Connect మరియు UTS ద్వారా కూడా లాగిన్ అయ్యే ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ మీకు IRCTC లేదా UTS ఖాతాలు లేకపోతే, మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, పక్కనే ఉన్న “రిజిస్టర్” బటన్ పై క్లిక్ చేయండి.
- వివరాలను నమోదు చేయండి: “రిజిస్టర్” పై క్లిక్ చేసిన తర్వాత, ఒక కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కింది వివరాలను నమోదు చేయాలి:
- మొబైల్ నంబర్ (Mobile Number): మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్ ఆటోమేటిక్‌గా వస్తుంది.
- పూర్తి పేరు (Full Name): మీ పూర్తి పేరును నమోదు చేయండి.
- ఈ-మెయిల్ ఐడీ (E-mail ID): మీ ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయండి.
- యూజర్ ఐడీ (User ID): మీరు యాప్ లోకి లాగిన్ అవ్వడానికి ఉపయోగించే యూజర్‌నేమ్‌ను ఇక్కడ క్రియేట్ చేయాలి.
- పాస్వర్డ్ (Password): మీ అకౌంట్‌కు ఒక బలమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయాలి.
- క్యాప్చా (Captcha): స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
- Username & Password క్రియేషన్:
- యూజర్‌నేమ్ (User ID):
- మీ యూజర్‌నేమ్ ప్రత్యేకంగా ఉండాలి (Unique).
- ఇది అక్షరాలు (letters) మరియు అంకెలు (numbers) కలయికతో ఉండవచ్చు.
- చిన్న అక్షరాలు (lowercase) మరియు పెద్ద అక్షరాలు (uppercase) రెండూ ఉపయోగించవచ్చు.
- సాధారణంగా 3 నుండి 10 అక్షరాల మధ్య ఉండాలి.
- ఉదాహరణకు: Reddy143, MyaccountID, srihari1998
- పాస్వర్డ్ (Password):
- మీ పాస్వర్డ్ బలమైనదిగా ఉండాలి.
- సాధారణంగా కనీసం 8 నుండి 15 అక్షరాల మధ్య ఉండాలి.
- ఇందులో చిన్న అక్షరాలు (lowercase letters), పెద్ద అక్షరాలు (uppercase letters), అంకెలు (numbers) మరియు ప్రత్యేక అక్షరాలు (special characters – ఉదాహరణకు !, @, #, $, %) తప్పనిసరిగా ఉండాలి.
- ఉదాహరణకు: Train@One$143, MyPass&2029
- యూజర్‌నేమ్ (User ID):
- Sign Up : అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసిన తర్వాత, “సైన్ అప్” (Sign Up) బటన్ పై క్లిక్ చేయండి.
- OTP వెరిఫికేషన్: మీ మొబైల్ నంబర్ మరియు ఈ-మెయిల్ ఐడీకి OTP (వన్ టైమ్ పాస్వర్డ్) వస్తుంది. ఆ OTPలను నమోదు చేసి, మీ అకౌంట్‌ను వెరిఫై చేయండి.
- mPIN సెట్ చేయండి: అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత, మీరు భవిష్యత్తులో సులభంగా లాగిన్ అవ్వడానికి mPIN లేదా బయోమెట్రిక్ లాగిన్ (వేలిముద్ర/ఫేస్ ఐడీ) సెట్ చేసుకోవచ్చు.

ఇలాగ మీరు RailOne యాప్‌లో విజయవంతంగా Register అవ్వొచ్చు మరియు మీ Username, Password ను Create చేసుకోగలరు.
RailOne యాప్‌లో రిజిస్ట్రేషన్, లాగిన్ పూర్తి చేసుకుని మీరు త్వరగా, సురక్షితంగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. కష్టమైన వెబ్సైట్ ప్రక్రియకు బదులు, ఈ యాప్‌తో మీ ప్రయాణ ప్లానింగ్ మరింత సులభం అవుతుంది. ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసి, మీ రైలు బుకింగ్ అనుభవాన్ని అప్డేట్ చేసుకోండి!
పూర్తి గా Registration Process క్రింద Video లో కూడా చెప్పడం జరిగింది. కావాలనుకున్న వారు క్రింద వీడియో కూడా చూడొచ్చు.















