నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో Mobile Phone తప్పనిసరి అయింది. రోజు మొత్తం వందల సార్లు ఉపయోగించే ఈ ఫోన్లకు Charger కూడా అంతే ముఖ్యమైంది. అయితే చాలామంది అలవాటు ప్రకారం, ఫోన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యాక కూడా ఛార్జర్‌ను ప్లగ్ నుంచి తీయకుండా సాకెట్లో వదిలేస్తారు, ఇలా చేయడం చాలా Danger ఈ చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో చాలా మందికి తెలియదు.
Table of Contents
టెక్ నిపుణుల హెచ్చరిక
టెక్నాలజీ నిపుణులు చెబుతున్నట్లుగా, Mobile Chargerను సాకెట్లో అలాగే వదిలేయడం చాలా Danger, కారణం ఏమిటంటే, Voltage ఒక్కసారిగా పెరిగితే ఛార్జర్ పేలిపోవచ్చు. దాంతో ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. Switch OFF చేసినా కూడా ఛార్జర్ కొంత మేర విద్యుత్‌ను వాడుతూనే ఉంటుంది. ఫలితంగా విద్యుత్ బిల్లు కూడా పెరుగుతుంది. అంటే, ఇది డబ్బు వృథా మాత్రమే కాకుండా ప్రాణాలకు ప్రమాదం కూడా అవుతుంది.
వేడి పెరిగి అగ్ని ప్రమాదం
Mobile Charger లోని అంతర్గత భాగాలు వేడెక్కడం వల్ల క్రమంగా అవి దెబ్బతింటాయి. ఇలా దెబ్బతిన్న ఛార్జర్లు ఒకరోజు short circuit అయ్యే అవకాశం ఉంటుంది.
అలా జరిగితే చిన్ని అగ్నిప్రమాదం పెద్ద ప్రమాదంగా మారవచ్చు. చాలాసార్లు న్యూస్‌లో ఇలాంటి సంఘటనలు వినిపిస్తున్నాయి.
చిన్నారులపై ప్రమాదం
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే Charger కు ఉన్న Cable క్రిందికి వేలాడుతూ ఉంటే వారు ఆ Cableను నోట్లో పెట్టుకునే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదం (Danger) . ఎందుకంటే, అలా చేస్తే విద్యుత్ నేరుగా శరీరంలోకి వెళుతుంది.
ఫలితంగా పిల్లల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగానే టెక్ నిపుణులు చిన్నారుల భద్రత కోసం ఎప్పుడూ Chargerను సాకెట్లో వదిలేయొద్దు అని సూచిస్తున్నారు.
ఎప్పుడూ అనుసరించాల్సిన జాగ్రత్తలు
- Battery Full అయిన వెంటనే ఛార్జర్‌ను ప్లగ్ నుంచి తీయాలి.
- Charger Cable నేలమీద లేదా క్రిందకి వేలాడకుండా సేఫ్‌గా ఉంచాలి.
- నాణ్యమైన, ఒరిజినల్ ఛార్జర్లనే వాడాలి. చవకైన డూప్లికేట్ ఛార్జర్లు ఇంకా Danger.
- ఛార్జర్ బాగా వేడెక్కితే వెంటనే వాడటం ఆపేయాలి.
- ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ ఛార్జర్‌ను సాకెట్ నుంచి అన్‌ప్లగ్ చేయడం తప్పనిసరి.
చిన్న నిర్లక్ష్యం – పెద్ద ప్రమాదం
- మొబైల్ ఛార్జర్‌ను సాకెట్లో వదిలేయడం చాలామందికి అలవాటై ఉంటుంది. కానీ ఈ అలవాటు వల్ల విద్యుత్ వృథా, ఆర్థిక నష్టం, ప్రాణాలకు ముప్పు కలగొచ్చు.
- నిపుణుల సూచనల ప్రకారం, ఛార్జర్ అవసరం లేనప్పుడు వెంటనే ప్లగ్ నుంచి తీయడం మంచిది.
ముగింపు:
చిన్న అలవాట్లు కూడా మన జీవితంలో పెద్ద ప్రభావం చూపుతాయి. ఛార్జర్‌ను సాకెట్లో వదిలేయడం ఒక చిన్న నిర్లక్ష్యమే అయినా, అది ప్రమాదాలకు కారణం కావచ్చు. కాబట్టి, మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండి, Phone Charge అయ్యాక వెంటనే ఛార్జర్‌ను అన్‌ప్లగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే మన ఇల్లు సేఫ్‌గా ఉంటుంది, విద్యుత్ బిల్లు తగ్గుతుంది, ముఖ్యంగా మన ప్రాణాలు కూడా రక్షితం అవుతాయి.















