Boost Your Mobile Battery Life Easily – Tips | Telugu

R V Prasad

By R V Prasad

Updated On:

Mobile Battery Backup Tips

Join Telegram

Join

Join Whatsapp

Join

“Mobile బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుందా? ఈ టిప్స్ మీ కోసమే!”

ఇప్పటి రోజుల్లో ఫోన్‌ లేకుండా ఏ పనీ జరగదు. కానీ అందులో Battery ఖాళీ అయితే? Charger దొరకకపోతే? అసలు పని పూర్తవుతుందా? అటువంటి సమస్యలు లేకుండా మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సమయం పడేందుకు కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు! ఎలాంటి స్పెషల్ యాప్‌లు లేదా హార్డ్‌వేర్ ట్రిక్స్ అవసరం లేకుండా, సులభంగా ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను పెంచే మార్గాలు ఇప్పుడు చూద్దాం.

1. Display Brightness తగ్గించండి:

ఫోన్‌లో ఎక్కువ బ్యాటరీ వాడేది స్క్రీన్‌ వల్లనే! మీరు brightness ఎక్కువగా ఉంచితే ఫోన్ త్వరగా discharge అవుతుంది. Auto-Brightness ON చేయండి లేదా మానువల్‌గా తక్కువ లెవెల్‌కి తీసుకెళ్లండి. ఇది ఒక చిన్న మార్పు అనిపించొచ్చు, కానీ చాలా వరకూ బ్యాటరీని save చేస్తుంది.

2. మీరు చాల రోజులుగా యూస్ చేయని యాప్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో నడవకుండా చేయండి:

మీకు నిజంగా అవసరం లేని apps నుంచి రోజంతా నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. వీటివల్ల ఫోన్ display ఎక్కువ సార్లు ఆన్ అవుతుంది, Vibration కూడా battery లైఫ్ తగ్గడానికి కారణం అని చెప్పొచ్చు, నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలంటే సెట్టింగ్స్ ఇలా చేయండి. Settings > Notifications లోకి వెళ్లి అవసరం లేని apps‌కి permissions Disable చేయండి.

3. డార్క్ మోడ్ ట్రై చేయండి (OLED / AMOLED స్క్రీన్లకు):

ఫ్యాషన్‌గానూ, ఫంక్షనల్‌గానూ ఉండే టెక్నిక్ ఈ డార్క్ మోడ్! AMOLED స్క్రీన్ ఉన్న ఫోన్‌లలో ఇది చాలా ప్రయోజనకరం. డార్క్ మోడ్ వాడటం వల్ల స్క్రీన్ power usage తగ్గుతుంది, దీని వల్ల బ్యాటరీ ఎక్కువకాలం సమయం వరకు ఉంటుంది. డార్క్ మోడ్‌తో బ్యాటరీ బాగా సేవ్ అవుతుంది, ముఖ్యంగా AMOLED డిస్ప్లేలు ఉన్న మొబైల్‌లలో బాగా ఉపయోగ పడుతుంది, ఇలా కూడా ట్రై చేయండి.

4. GPS, Wi-Fi, Bluetooth అవసరమైతేనే ఆన్ చేయండి:

ఈ మూడు ఫీచర్స్ batteryకు పెద్ద విలన్‌లే! ఫోన్ wifi లేదా Bluetooth signal కోసం backgroundలో పనిచేస్తూనే ఉంటాయి. అవసరం లేనప్పుడు ఈ ఫీచర్స్‌ ని manual గా ఆఫ్ చేయడం మంచిది, ట్రావెల్ చేస్తున్నప్పుడు Aeroplane mode వాడటం కూడా మంచిది. నిరంతరం GPS ON లో ఉంటే బ్యాటరీ తక్కువైపోతుంది. అవసరమైతేనే వాడండి.

5. Background Apps‌ను కంట్రోల్ చేయండి:

చాలా apps మీరు వాడకపోయినా backgroundలో రన్ అవుతూనే ఉంటాయి. ఇది batteryను ఎక్కువగా drain చేస్తుంది. అలా బ్యాటరీ డ్రై అవకుండా ఉండాలంటే ఇలా సెట్టింగ్స్ చేసుకోండి. Settings > Battery Usage > Background Activity లో unnecessary apps‌ను restrict చేయండి. Android & iPhone రెండింటిలోనూ ఇది చాలా effective trick. చాలా యాప్స్ నోటిఫికేషన్స్ వల్ల స్క్రీన్ ఆన్ అవుతూ బ్యాటరీ వృథా అవుతుంది.

6. Battery Saver Mode వాడండి:

మొబైల్‌లో ముందే ఇచ్చే battery saver లేదా power saving mode వాడడం కూడా చాలా మంచిది. ఇది unnecessary background tasks‌ ను ఆపేస్తుంది, Auto sync, animations, vibrations ఇలాంటివి చాలా వరకు తగ్గిస్తుంది. బ్యాటరీ తక్కువగా ఉన్నపుడు Power Saver Mode లేదా Ultra Power Saver Mode వాడటం మంచిది.

7. మొబైల్ కు Fast Charging vs Slow Charging – ఏది మంచిది?

మొబైల్ కు ఫాస్ట్ ఛార్జింగ్ మంచిదే, కానీ ఫోన్ వేడెక్కే అవకాశం ఉంటుంది, (మొబైల్ తో వచ్చే ఒరిజినల్ చార్జర్ నుండి ఛార్జింగ్ పెడితే మొబైల్ చాల వరకు హీట్ అవ్వదు). బయట మార్కెట్ లో దొరికే ఫాస్ట్ చార్జర్ మన మొబైల్ కు సపోర్ట్ చేయకుంటే బాటరీ హీట్ అవుతుంది, దీని వల్ల Battery Health తగ్గే ప్రమాదం ఉంది. అవసరం అయితే ఫాస్ట్ ఛార్జ్ వాడండి, కానీ నిద్రలో ఉన్నప్పుడు లేదా ఫోన్ ఎక్కువ టైం వాడకపోతే నెమ్మదిగా ఛార్జ్ చేయడం మంచిది. చీప్ లేదా Non Authorized Chargers బ్యాటరీ హెల్త్‌ను Damage చేస్తాయి.

8. Live Wallpapers & Widgets తగ్గించండి:

Live wallpapers బాగుంటాయనుకుంటారు కానీ అవి battery మీద భారం పడుతుంది. Continuously animation ఉండటం వల్ల Processor, GPU పనిచేస్తూనే ఉంటాయి. అందువల్ల బ్యాటరీ త్వరగా అయిపోవడానికి ఇవి కూడా కారణం అని చెప్పొచ్చు. Static wallpaper పెట్టండి, బ్యాటరీ సేవ్ అవుతుంది. Motion Wallpapers, Live Clock /Weather Widgets వల్ల బ్యాటరీ ఎక్కువ ఖర్చవుతుంది గమనించండి.

9. యాప్స్ / సిస్టమ్ అప్డేట్ చేయండి:

ఫోన్ మాన్యుఫాక్చరర్‌లు తరచూ కొత్త updates‌ రిలీజ్ చేస్తారు. వాటిలో చాలా వరకూ battery optimization improvements ఉంటాయి. Software updates install చేయడం ద్వారా కొత్త battery-saving features వాడుకోవచ్చు. కొత్త అప్‌డేట్స్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మెరుగుపరుస్తాయి. రికమెండ్ చేసినప్పుడు అప్డేట్ చేయండి.

10. Software Updates తప్పనిసరి:

ఫోన్ మాన్యుఫాక్చరర్‌లు తరచూ కొత్త updates‌ రిలీజ్ చేస్తారు. వాటిలో చాలా వరకూ battery optimization improvements ఉంటాయి. Software updates install చేయడం ద్వారా కొత్త battery-saving features వాడుకోవచ్చు.

చివరగా చిన్న చిట్కాలు, పెద్ద లాభం!

మీరు Battery Usage సెక్షన్‌లో చూసి, ఎక్కువగా బ్యాటరీ వాడుతున్న యాప్స్‌ను గుర్తించి తగిన చర్యలు తీసుకోండి. మీ మొబైల్ లో Network లేనప్పుడు Aeroplane mode వాడటం మంచిది బ్యాటరీ సేవ్ అవుతుంది. ఇక్కడ చెప్పిన ఈ టిప్స్ చూస్తే చాలా సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ ఇవి ఫాలో అయితే మీ ఫోన్ battery life స్పష్టంగా మెరుగవుతుంది. రోజూ ఫోన్ రెండు సార్లు ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి లేకుండా, ఒకసారి చార్జ్ చేస్తే చాలు, రోజంతా సాఫీగా పని చేస్తుంది! ఈ టిప్స్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి.

ఇంకా పూర్తి సమాచారం కావాలనుకుంటే ఈ క్రింద ఇవ్వబడిన వీడియో ను చూడండి…

R V Prasad

R V Prasad

R V Prasad is the founder and editor of rvprasadtech.com & @rvprasadtech YouTube Channel. He writes daily about Trending Tech New Updates, Railway Updates and trending news in Telugu. With a strong focus on authenticity and public needs, his mission is to make useful information easily available to every reader.

Leave a Comment