మారుతి EV! ఇండియాలోనే తయారు చేసిన e-Vitara – 500km రేంజ్‌తో, విదేశాలకూ ఎగుమతి!
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో మరొక చరిత్రాత్మక ముందడుగు పడింది. మారుతి సుజుకీ – ఇప్పటివరకు పేట్రోల్, డీజిల్ వాహనాలతోనే కనిపించిన ఈ బ్రాండ్ ఇప్పుడు తన మొదటి ఎలక్ట్రిక్ SUV – e-Vitaraతో ఎలక్ట్రిక్ రంగంలోకి దూసుకొచ్చింది.
ఈ ఎలక్ట్రిక్ బ్యూటీ గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్లాంట్‌లో తయారవుతోంది. ఇది కేవలం భారతదేశంలోనే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్లలోకి ఎగుమతి చేయబడుతుంది అనే విషయం మరింత ప్రత్యేకతను ఇస్తోంది.
Table of Contents
రెండు బ్యాటరీల ఆప్షన్లు – ఈ కారు లో
Auto Expo 2025లో తొలిసారి పరిచయమైన ఈ కార్కి రెండు బాటరీ వేరియంట్లు ఉన్నాయి:
- 61.1kWh
- 48.8kWh
ఈ రెండింటికీ ఒకే ఎలక్ట్రిక్ మోటార్ జతచేయబడింది. మారుతి ప్రకారం, ఈ కాంబినేషన్‌తో ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అంటే రోజువారి ప్రయాణాల్లో ఛార్జింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
50 నిమిషాల్లో 80% ఛార్జ్!
ఈ కారు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. దాంతో సున్నా నుంచి 80% వరకు కేవలం 50 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. అంటే లాంగ్ డ్రైవ్ మద్యలో కాసేపు కాఫీ తాగుతూ ఉండగానే కార్ రెడీ అవుతుంది!
మూడు వేరియంట్లు – డెల్టా, జెటా, ఆల్ఫా
ఈ 2025 e-Vitara SUV, మూడు వేరియంట్లలో మార్కెట్లోకి రానుంది:
- Delta
- Zeta
- Alpha
ప్రతి వేరియంట్‌కి ప్రత్యేకమైన ఫీచర్లు, ఇంటీరియర్ డిజైన్, టెక్నాలజీ ఉండబోతున్నాయి. ధరలు ఇంకా వెల్లడించలేదు కానీ, ఈ SUV ప్రీమియం సెగ్మెంట్‌కి తగ్గట్టుగా కనిపిస్తోంది.
ఈ కొత్త EV ని 10 ఆకర్షణీయమైన కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు:
సింగిల్ టోన్ కలర్స్:
- Opulent Red
- Bluish Black
- Arctic White
- Grandeur Grey
- Splendid Silver
- Nexa Blue
డ్యూయల్ టోన్ కలర్స్ (Bluish Black రూఫ్‌తో):
- Land Breeze Green
- Splendid Silver కలర్స్‌లో క్లాస్ & క్లారిటీ
- Opulent Red
- Arctic White
ఇవి చూస్తే స్పష్టంగా మారుతి e కారు రూపకల్పనలో స్టైల్, యూత్ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
భారత్ నుంచి ప్రపంచానికి
ఇది కేవలం భారత మార్కెట్‌కి మాత్రమే కాదు. పలు అంతర్జాతీయ మార్కెట్లకి కూడా ఈ కార్ ఎగుమతి చేయనున్నట్టు మారుతి అధికారికంగా వెల్లడించింది. అంటే “Make in India” కాన్సెప్ట్‌ని ప్రాక్టికల్‌గా చూపించబోతున్నదీ e-Vitara.
మీకు తెలుసా:
- India లో తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్
- భారీగా మైలేజ్ – 500KM
- ఫాస్ట్ ఛార్జింగ్
- స్టైలిష్ డిజైన్ & కలర్స్
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్
క్లూజింగ్ థాట్…
e-Vitara మారుతి నుంచి వచ్చిన మొట్టమొదటి EV కావడం ఒకవైపు, పూర్తి స్థాయిలో ఇండియాలో తయారు కావడం మరోవైపు ఇది భారత ఆటోమొబైల్ రంగానికి గర్వకారణం. టాటా, మహీంద్రాల వంటి కంపెనీలతో పోటీగా మారుతి కూడా EV రేసులోకి దిగడమే కాకుండా, ఎగుమతులు ద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదగబోతోంది.
మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఈ EVని కొనాలనుకుంటున్నారా? కామెంట్స్‌లో తెలియజేయండి!















