ఈ రోజుల్లో టికెట్ బుకింగ్, Tatkal బుకింగ్, లేదా మరే ఇతర రైల్వే సర్వీసు అయినా IRCTC Account తప్పనిసరిగా అవసరం. అయితే కొన్ని సేవలు పొందాలంటే మీరు మీ IRCTC ఖాతాను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసి ఆథెంటికేట్ చేయాలి. ఇది ఎంత సింపుల్ గా చేయవచ్చో తెలుసా? ఈ బ్లాగ్ లో మీకు IRCTC ఆధార్ వెరిఫికేషన్ పూర్తి విధానం, దాని ప్రయోజనాలు, మరియు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా ఇవ్వడం జరిగింది.
ఆధార్ వెరిఫికేషన్ ఎందుకు అవసరం?
మీ IRCTC ఖాతాను ఆధార్‌తో లింక్ చేస్తే మీరు పొందే ప్రయోజనాలు:
- ఒక నెలలో 12 టికెట్లు బుక్ చేయగలగడం (ఇలా చేయని ఖాతాలో కేవలం 6 టికెట్లు మాత్రమే).
- Tatkal బుకింగ్ సమయంలో ఫాస్ట్ వెరిఫికేషన్.
- Original Identity Proof లింక్ అవడంతో అకౌంట్ misuse అవ్వకుండా ఉంటుంది.
- Future లో facial authentication లాంటి advanced features కోసం రెడీ అవుతుంది.
ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు
మీరు ఆధార్ వెరిఫికేషన్ చేయాలంటే: మీకు ఒక IRCTC అకౌంట్ ఉండాలి, మీరు ఆధార్ కార్డ్ నంబర్ మరియు మీ ఆధార్ తో లింక్ అయిన ఒరిజినల్ మొబైల్ నంబర్ తో రెడీగా ఉండాలి (OTP ఆ నంబరికి వస్తుంది)
ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ Step by Step:
- IRCTC వెబ్‌సైట్‌కి వెళ్లండి:
👉 https://www.irctc.co.in - లాగిన్ అవ్వండి:
మీ యూజర్‌ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. - “My Account” మెనూకి వెళ్లండి
లాగిన్ అయిన తర్వాత, పై మెనులో “My Profile” > “Aadhaar KYC” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. - ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి:
12 అంకెల ఆధార్ నంబర్ టైప్ చేసి, Send OTP బటన్ క్లిక్ చేయండి. - OTP ఎంటర్ చేయండి:
మీ ఆధార్‌కు లింకైన మొబైల్‌కు వచ్చిన OTP ఎంటర్ చేసి Verify బటన్‌పై క్లిక్ చేయండి. - సక్సెస్ఫుల్ వెరిఫికేషన్:
వెరిఫికేషన్ అయ్యాక మీ ప్రొఫైల్‌లో “Aadhaar Verified” అని చూపిస్తుంది.
మొబైల్ యాప్ ద్వారా చేయాలంటే ?
మీరు ఈ ప్రక్రియను IRCTC Mobile App ద్వారా కూడా పూర్తి చేయవచ్చు:
- IRCTC ఆఫీషియల్ యాప్ (Rail Connect App) ఓపెన్ చేయండి
- మీ అకౌంట్లో లాగిన్ అవ్వండి
- “My Account” సెక్షన్ > Aadhaar KYC ఆప్షన్ ఎంచుకోండి
- ముందే చెప్పిన విధంగా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, OTP ద్వారా వెరిఫై చేయండి
ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి?
ఏదైనా తప్పు వల్ల ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్ అయితే, ఆధార్ కార్డ్ లో ఉన్న వివరాలు IRCTC అకౌంట్లో ఉన్న వివరాలు మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేయండి, ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కి OTP వస్తుందో లేదో చూడండి, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇంకో సరి ట్రై చేయండి.
ముఖ్యమైన సూచనలు
మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు, DOB, లింగం వివరాలు మీ IRCTC అకౌంట్‌కి సరిపోతేనే వెరిఫికేషన్ సక్సెస్ అవుతుంది. ఒకసారి KYC పూర్తైతే, తిరిగి ఆధార్ డీటెయిల్స్ మార్చలేరు. మీ అకౌంట్లో తప్పుగా ఇచ్చిన డీటెయిల్స్ ఉంటే, ముందుగా వాటిని update చేయండి (Profile → Edit) చేయండి.
ఒక్కమాటలో చెప్పాలంటే
మీ IRCTC ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడం పెద్ద పని కాదు. కేవలం 5 నిమిషాల్లో ఆథెంటికేషన్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా మీరు మరిన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు – ముఖ్యంగా టికెట్ బుకింగ్ పరంగా!
- మీరు ఒక నెలలో 12 టికెట్లకంటే ఎక్కువ బుక్ చేయాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి.
- ఆధార్ వెరిఫికేషన్ పూర్తయ్యాక మీరు నెలకు 24 టికెట్లు బుక్ చేయవచ్చు.
- Jul 1 2025 వ తారీకు నుండి తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలంటే Aadhar Authentication తప్పకుండ చేయాలి.
- Tatkal బుకింగ్ వేగంగా పూర్తవుతుంది.
- ఐడెంటిటీ స్కాంలు, అకౌంట్ దుర్వినియోగం తక్కువ అవుతుంది.
- భవిష్యత్తులో బయోమెట్రిక్ వేరిఫికేషన్ (Face ID, Iris) వంటివి వస్తే, అవి కూడా సపోర్ట్ అవుతాయి.
- ఒక్క మాటలో చెప్పాలంటే – మీ అకౌంట్‌కి అధికారిక ముద్ర పడిపోతుంది!
పూర్తి సమాచారం వీడియో రూపం లో కావాలంటే క్రింద పోస్ట్ చేసాను చుడండి…
















1 thought on “IRCTC Account with Aadhar Authentication process Telugu”