ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఖాతా కలిగినవారు ఇప్పుడు సులభంగా తమ అకౌంట్‌ను PhonePe యాప్‌తో లింక్ చేసుకోవచ్చు. ఒకసారి లింక్ చేసిన తర్వాత UPI ద్వారా డబ్బులు పంపడం, రీచార్జ్ చేయడం, బిల్లులు చెల్లించడం వంటి అన్ని సర్వీసులు వాడుకోవచ్చు. ఇందుకు అవసరమయ్యే స్టెప్స్ సింపుల్‌గా ఉండటంతో ప్రతి యూజర్ కూడా ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయగలరు.
IPPB అకౌంట్‌ను PhonePe తో లింక్ చేసే విధానం step by step తెలుగులో,
Table of Contents
1. PhonePe యాప్ ఓపెన్ చేయండి
- మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్, IPPB బ్యాంక్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
- PhonePe యాప్ ఓపెన్ చేయండి.
2. ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేయండి
- ఎడమ పైభాగంలో ఉన్న Profile Photo/Icon పై టాప్ చేయండి.
- “Bank Accounts” అనే Option ను ఎంచుకోండి.
3. Add New Bank Account క్లిక్ చేయండి
- బ్యాంకుల లిస్ట్ చూపిస్తుంది.
- అందులో India Post Payments Bank (IPPB)ని సెలెక్ట్ చేయండి.
4. మొబైల్ నంబర్ వెరిఫై చేయండి
- మీ ఫోన్ నుండి SMS ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది, ఆ టైం లో మీ అకౌంట్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు sms బాలన్స్ ఉండాలి, మరియు ఆ SIM Card మీరు PhonePe ఉపయోగించే మొబైల్ లో ఇన్సర్ట్ చేసి ఉండాలి, ఇది ప్రతి ఒక్కరు గమనించండి.
- మీ SIM (IPPB బ్యాంక్‌తో లింక్ అయింది) అదే ఫోన్లో ఉండాలి.
5. అకౌంట్ లింక్ అవుతుంది
- వెరిఫికేషన్ అయిన తర్వాత, మీ IPPB అకౌంట్ ఆటోమాటిక్‌గా ఫెచ్ అవుతుంది.
- లింక్ అవుతుంది.
6. UPI PIN సెటప్ చేయండి
- మీ దగ్గర IPPB డెబిట్ కార్డ్ ఉంటే:
- చివరి 6 అంకెల డెబిట్ కార్డ్ నంబర్, Expiry Date ఎంటర్ చేయండి.
- OTP వస్తుంది → OTP ఎంటర్ చేయండి → మీ కొత్త UPI PIN సెట్ చేయండి.
- మీరు ఇప్పటికే PIN సెట్ చేసి ఉంటే → వాడటం మొదలుపెట్టండి.
ముఖ్యమైన సూచనలు :-
- మొబైల్ నంబర్ IPPB & PhonePe రెండింటిలో ఒకటే ఉండాలి.
- SMS వెరిఫికేషన్ ఫెయిల్ అయితే, డేటా & నెట్వర్క్ ఆన్‌గా ఉంచండి.
- డెబిట్ కార్డు లేకున్నా, మీ PhonePe అనేది ఆధార్ తో లింక్ అయ్యి ఉండాలి (KYC completion).
ముగింపు:
మొత్తం మీద, IPPB అకౌంట్‌ను PhonePe తో లింక్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, యాక్టివ్ SMS ప్యాక్ మరియు UPI PIN ఉండటం తప్పనిసరి. ఒకసారి సక్సెస్‌ఫుల్‌గా లింక్ చేసిన తర్వాత PhonePe ద్వారా మీ IPPB బ్యాంక్ ట్రాన్సాక్షన్లు సెక్యూర్‌గా, ఫాస్ట్‌గా చేయగలుగుతారు. ఇలా మీ ఫోన్ నుంచే డిజిటల్ పేమెంట్స్ మరింత సులభమవుతాయి.
- India Post Payment Bank ను Virtual Debit Card తో PhonePe లింక్ చెయ్యాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి.
















