ఫోన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్, RC? – NextGen mParivahan App Full Guide తెలుగులో!
ఈ రోజుల్లో మనం ప్రతిదీ డిజిటల్‌గా చేస్తుంటాం. పేమెంట్స్, టికెట్లు, బ్యాంకింగ్ అన్నీ మొబైల్‌లోనే పూర్తవుతుంటాయి. అలాంటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ (DL) లేదా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) కూడా ఫోన్‌లో ఉంటే ఎంత బాగుంటుందో కదా? ఈ అవసరాన్ని గుర్తించి భారత ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్‌నే NextGen mParivahan App. ఈ యాప్ ద్వారా మీరు Virtual DL, RC పొందడం, చలాన్లు చెక్ చేయడం, ఇంకా వాహనానికి సంబంధించిన ఇతర సమాచారం కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ యాప్ ఎలా ఉపయోగించాలో పూర్తి వివరంగా చూద్దాం.
NextGen mParivahan App అంటే ఏమిటి?
NextGen mParivahan అనేది రోడ్డు రవాణా శాఖ (Ministry of Road Transport & Highways – MoRTH) ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వంటి సమాచారం ఈజీగా పొందొచ్చు.
ఈ యాప్ ద్వారా మీరు పొందగలిగే ముఖ్యమైన సేవలు:
- Virtual Driving Licence (DL)
- Virtual Registration Certificate (RC)
- Pending Challans వివరాలు
- వాహన యజమాని వివరాలు, ఫిట్‌నెస్ స్టేటస్, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ వంటివి ఇందులో చూడొచ్చు.
Table of Contents
NextGen mParivahan Appను ఎలా డౌన్‌లోడ్ & రిజిస్టర్ చేయాలి?
- మీ ఫోన్ లో Play Store (Android) లేదా App Store (iPhone) ఓపెన్ చేయండి.
- “NextGen mParivahan” అని సెర్చ్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
- యాప్ ఓపెన్ చేసిన తర్వాత, మీ మొబైల్ నెంబర్ ఉపయోగించి రిజిస్టర్ అవ్వాలి.
- OTP ద్వారా వేరిఫై చేయండి – అంతే, మీరు రెడీ!
Virtual Driving Licence (DL) ఎలా పొందాలి?
- యాప్ హోమ్ స్క్రీన్‌లో ‘My Dashboard’ లోకి వెళ్లండి.
- అక్కడ ‘Add Virtual DL’ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి.
- మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ నమోదు చేయండి. ఉదా: AP1234567890001
- DLతో లింక్ అయిన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది.
- OTP ద్వారా వేరిఫై చేసిన తర్వాత మీ Virtual DL యాప్‌లో Save అవుతుంది.
📌 ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం: ఇది DigiLocker లాగానే గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన డాక్యుమెంట్. ఫిజికల్ కార్డ్ లేని సమయాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
Virtual RC (Registration Certificate) పొందే విధానం
- My Dashboardలో ‘Add Virtual RC’ అనే ఆప్షన్ ఎంచుకోండి.
- మీ వాహన నంబర్ (ఉదా: TS09AB1234) ఎంటర్ చేయండి.
- RCకి లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది.
- OTP ఎంటర్ చేసి వేరిఫై చేసిన తర్వాత, RC Details యాప్‌లోకి వస్తుంది.
ఇకపై మీరు ఎప్పుడైనా RCని వెంటనే ఫోన్‌లో చూపించవచ్చు. Offlineలో కూడా Access చేయొచ్చు!
Challan Status ఎలా చెక్ చేయాలి?
- హోమ్ స్క్రీన్‌లో లేదా మెనూ లో ‘Transport Services ’ ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి Challan Services అని ఉంటుంది.
- దానిపై క్లిక్ చేసి మీ వాహన నంబర్ ఎంటర్ చేయండి.
- వాహనానికి సంబంధించిన అన్ని పెండింగ్ చలాన్‌లు, వాటి వివరాలు (తేదీ, మొత్తం, విభాగం) చూపిస్తుంది.
- మీరు అక్కడే పేమెంట్ గేట్‌వే ద్వారా చలాన్ క్లియర్ చేయవచ్చు.
📌 ఇది సురక్షితమైన, ప్రభుత్వ అధికారిక చలాన్ ఇన్ఫర్మేషన్.
Appలో మరో ఉపయోగకరమైన ఫీచర్లు:
- వాహన యజమాని పేరు, చిరునామా వివరాలు
- వాహనం Fitness స్టేటస్
- PUC (Pollution Certificate) సమాచారం
- ఇన్సూరెన్స్ ఎక్స్‌పైరీ డేట్
- ట్రాఫిక్ చలాన్ల గణాంకాలు
- డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ స్టేటస్, ఇవన్నీ కూడా ఈ యాప్ ద్వారా చూడొచ్చు.
చివరగా:
NextGen mParivahan App వాడటం చాలా ఈజీ. ఫోన్‌లో ఉండే ఈ యాప్‌తో మీ వాహనానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఒకే చోట ఉంచుకోవచ్చు. మీరు తరచూ ట్రావెల్ చేసే వారు అయితే, లేదా డ్రైవింగ్ చేసేవారైతే ఈ యాప్ తప్పకుండ మీ మొబైల్ లో ఉండాలి.
ఇంకా మీరు ఈ NextGen mParivahan యాప్ వాడడం మొదలుపెట్టలేదా? అయితే వెంటనే ప్లే స్టోర్ ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయినా, RC దొరకకపోయినా NextGen mParivahan మీకు మంచి ఆప్షన్ గా ఉంటుంది!
మీరు కూడా వాడుతున్నారా ఈ యాప్? ఎలాంటి అనుభవం వచ్చిందో కామెంట్‌లో చెప్పండి!
అలాగే ఈ సమాచారం వీడియో రూపంలో కావాలనుకుంటే ఈ క్రింది వీడియో చుడండి…















