“Google’s Emergency Alert: Change Your Gmail Password Immediately!” – Telugu

R V Prasad

By R V Prasad

Updated On:

gmail securirt alert

Join Telegram

Join

Join Whatsapp

Join

Gmail వాడుతున్నారా? Google నుంచి అత్యవసర హెచ్చరిక! ఈ 6 కొత్త రూల్స్ ద్వారా మీ అకౌంట్‌ను రక్షించుకోండి, లేదంటే డేంజర్!

టెక్ దిగ్గజం Google తాజాగా ఓ శాకింగ్ సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.5 బిలియన్ Gmail యూజర్లు వెంటనే అప్రమత్తం కావాలని హెచ్చరించింది. దీనికితోడు, మీ Passwords వెంటనే మార్చుకోవాలంటూ గట్టిగా సూచిస్తోంది. ఇది అంతా ఒక Salesforce డేటాబేస్ లీక్ వల్ల జరిగిందని గూగుల్ చెప్పింది. Gmail లేదా Google Cloud అకౌంట్స్ నేరుగా హ్యాక్ కాలేదు కానీ, ఈ డేటా లీక్ వల్ల భారీగా ఫిషింగ్ (Phishing), విషింగ్ (Vishing) దాడులు జరుగుతున్నాయి అని అంచనా. ఇవి యూజర్లను టార్గెట్ చేస్తూ అకౌంట్స్‌ను టేకోవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఫిషింగ్ దాడులు పెరిగిపోయాయి… అప్రమత్తంగా ఉండండి!

మీరు Gmail వాడుతున్నారా! Google తాజా స్టేట్మెంట్ ప్రకారం, ఈ మధ్య కాలంలో ఫిషింగ్, విషింగ్ దాడులు బాగా పెరిగిపోయాయి. Google యొక్క ఒక Salesforce డేటాబేస్ హ్యాక్ చేయబడింది. ఇందులో ఉన్న కంపెనీ పేర్లు, కస్టమర్ డేటా లాంటి సాధారణ సమాచారం హ్యాకర్లు ఫేక్ మెయిల్స్ పంపడానికి వాడుతున్నారు. ఇవి నిజమైన Google మెయిల్స్ లాగా కనిపిస్తూ, యూజర్లను మోసం చేస్తున్నాయి.ఇక్కడ అసలైన ప్రమాదం ఏమిటంటే, ఈ మెయిల్స్ ద్వారా యూజర్ల నుండి App Passwords, లేదా ఇతర సెక్యూరిటీ కోడ్స్ పొందడానికి ప్రయత్నిస్తున్నారు.

“మీ Gmail అకౌంట్ సేఫ్‌గా ఉందా?” – మీరు ఈ స్టెప్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి!

Google ప్రకారం, ఇప్పటికీ Gmail చాలా సురక్షితమైన ప్లాట్‌ఫామ్. కానీ మీరు తప్పకుండ తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే:

  • పాస్‌వర్డ్ మార్చండి – సింపుల్ పాస్‌వర్డ్స్ వద్దండి. స్ట్రాంగ్ మరియు యూనిక్ పాస్‌వర్డ్ పెట్టండి.
  • 2-Factor Authentication (2FA) తప్పనిసరి. ఇది సాధ్యమైనంతవరకూ SMS ఆధారితంగా కాకుండా Authenticator App లేదా Security Key వాడండి.
  • App Passwords ఉపయోగించడం తగ్గించండి. అవి ఇప్పుడు మోసం చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు.
  • ఫిషింగ్ మెయిల్స్‌కి గుర్తింపు రావడంలో ట్రైనింగ్ తీసుకోండి. మోసపోయే మెయిల్స్ ఎలా ఉంటాయో తెలుసుకోండి.
  • మీ ఫోన్, ల్యాప్‌టాప్ OS & Apps అన్నీ అప్డేట్‌లో ఉండాలి. సెక్యూరిటీ బగ్స్ ఫిక్స్ కావాలంటే ఇది తప్పనిసరి.
  • సెక్యూరిటీ అలర్ట్స్ గమనించండి. మీరు లాగిన్ చేయని డివైస్ నుంచి యాక్సెస్ వస్తే వెంటనే మార్పులు చేయండి.

విశ్వసనీయమైన సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేయండి. ఫేక్ వెబ్‌సైట్స్‌కి బ్లాక్ చేసే యాంటీ వైరస్ తప్పనిసరి.

Gmail యూజర్లు తప్పక ఫాలో చేయాల్సిన 6 కొత్త రూల్స్:

1. App Passwords వాడకండి (అత్యవసరమైతే తప్ప):

పాత ఫోన్లు లేదా 2FA సపోర్ట్ లేని డివైస్‌లు వాడితే తప్ప వాడొద్దు.

2. Authenticator App వాడండి:

SMS ఆధారిత కోడ్స్ కంటే, Google Authenticator, Microsoft Authenticator లేదా Security Keys (FIDO2/WebAuthn) బెటర్.

3. ఫిషింగ్ అలర్ట్ అవ్వండి:

ఈమెయిల్స్ లేదా కాల్స్ ద్వారా ఎవరికైనా కోడ్, పాస్‌వర్డ్ ఇవ్వకండి.

4. అప్డేట్స్ తప్పనిసరి:

మీ ఫోన్, ల్యాప్‌టాప్, బ్రౌజర్ – అన్నీ లేటెస్ట్ వెర్షన్‌లో ఉండాలి.

5. అనుమానాస్పద లాగిన్స్‌పై నజరేయండి:

మీ అకౌంట్‌లోకి ఎవరో లాగిన్ అయిందా? వెంటనే పాస్‌వర్డ్ మార్చండి.

6. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ వాడండి:

ఫిషింగ్ వెబ్‌సైట్స్, మాల్వేర్‌ను గుర్తించే టూల్స్ ఉండాలి.

Google అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (APP) మీకు సేఫ్టీ గ్యారంటీ!

ఇది గూగుల్ అందించిన అత్యధిక భద్రత కలిగిన ప్రొటెక్షన్ సర్వీస్. మీరు టార్గెట్ అయే ఛాన్స్ ఉంటే తప్పకుండా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వండి.Google ప్రకారం, Passkeys పాస్‌వర్డ్‌లకు మంచి ప్రత్యామ్నాయం. ఇవి మీ డివైస్‌లో మాత్రమే ఉంటాయి. బయటకి లీక్ అవే అవకాశం లేదు.

మరిన్ని వివరాల కోసం?

Google యొక్క అధికారిక Account Help Page ను లేదా Security Center ను సందర్శించండి. మీ అకౌంట్‌ని ఎలా రక్షించుకోవాలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంది.

చివరగా
మీ Gmail అకౌంట్ మీకు చాలా విలువైనది. Google ఇచ్చిన ఈ హెచ్చరికను లైట్‌గా తీసుకోవద్దు. ఈ 6 రూల్స్ ఫాలో అయితేనే మీ డేటా సురక్షితం. లేదంటే… హ్యాకర్ల చేతికి మీరు ఎప్పుడైనా చిక్కే అవకాశం ఉంది!

ఈ బ్లాగ్‌ను మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి… జాగ్రత్త పడండి, ఇతరులను కూడా జాగ్రత్తపరచండి!

R V Prasad

R V Prasad

R V Prasad is the founder and editor of rvprasadtech.com & @rvprasadtech YouTube Channel. He writes daily about Trending Tech New Updates, Railway Updates and trending news in Telugu. With a strong focus on authenticity and public needs, his mission is to make useful information easily available to every reader.

Leave a Comment