8 వేల రూపాయల లోపే 5G ఫోన్లు! నమ్మలేనంత తక్కువ ధరలో లభించే టాప్ మోడల్స్
ఇప్పట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే 5G లేకుండా ఊహించలేము. కానీ చాలా మంది మనసులో ఒక డౌట్ ఉంటుంది – 5G ఫోన్ అంటే ఖరీదు ఎక్కువే అవుతుందేమో? అనేది. సాధారణంగా 12 నుంచి 15 వేల మధ్య ఖర్చు అవుతుందని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకోవాల్సిందే!
ఆన్‌లైన్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్‌లు, ఫ్లాష్ సేల్స్ వంటివి ఉపయోగించుకుంటే, ₹8,000 లోపే కూడా 5G స్మార్ట్‌ఫోన్లు మీ చేతిలోకి రావొచ్చు. అయితే ఈ ధర సెగ్మెంట్‌లో చాలా ఆప్షన్స్ ఉండకపోయినా, కొన్ని బ్రాండ్లు మాత్రం కస్టమర్ల కోసం బలమైన ఫీచర్లతో మంచి ఫోన్లు మార్కెట్లోకి తెచ్చాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం 👇
Table of Contents
POCO C75 5G
బడ్జెట్ ఫోన్లలో POCOకి ఎప్పటినుంచో మంచి పేరుంది. ఇప్పుడు తక్కువ ధరలో 5G ఫోన్‌ను కూడా అందిస్తోంది.
- ధర: ₹7,699 – ₹8,000 (ఆఫర్లపై ఆధారపడి మారవచ్చు)
- డిస్‌ప్లే: 6.88” HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ – వీడియోలు, గేమ్స్ స్మూత్‌గా రన్ అవుతాయి.
- ప్రాసెసర్: Qualcomm Snapdragon 4s Gen 2 5G – ఈ ధరలో బలమైన పనితీరు.
- కెమెరా: వెనుక 50MP డ్యూయల్ కెమెరా + 5MP సెల్ఫీ కెమెరా.
- బ్యాటరీ: 5160mAh, 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
- సాఫ్ట్‌వేర్: Android 14 (MIUI), త్వరలో Android 15 అప్‌డేట్ కూడా వస్తుంది.
Redmi A4 5G
బడ్జెట్ ఫోన్లలో Redmi ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఈ A4 5G కూడా అదే కేటగిరీలోకి వస్తుంది.
- ధర: సుమారు ₹7,998
- డిస్‌ప్లే: 6.88” IPS LCD HD+ డిస్‌ప్లే.
- ప్రాసెసర్: Snapdragon 4s Gen 2 చిప్‌సెట్.
- కెమెరా: 50MP రియర్ కెమెరా + 5MP ఫ్రంట్ కెమెరా.
- బ్యాటరీ: 5160mAh, 18W ఫాస్ట్ ఛార్జింగ్.
- సాఫ్ట్‌వేర్: Android 14.
Infinix Hot 50 5G
యువతలో ఎక్కువగా పాపులర్ అవుతున్న Infinix, బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో హాట్ ఆప్షన్ తీసుకొచ్చింది.
- ధర: ఆఫర్లలో ₹8,000 లోపు దొరకొచ్చు.
- డిస్‌ప్లే: 6.7” HD+ డిస్‌ప్లే.
- ప్రాసెసర్: MediaTek Dimensity 6300 5G – ఈ ధరలో చాలా పవర్‌ఫుల్.
- కెమెరా: 48MP రియర్ కెమెరా + 8MP సెల్ఫీ కెమెరా.
- బ్యాటరీ: సుమారు 5000mAh.
- డిజైన్: స్టైలిష్ ప్రీమియం లుక్.
Lava Shark 5G
ఇండియన్ బ్రాండ్ Lava కూడా ఇప్పుడు 5G రేస్‌లో దూసుకెళ్తోంది. Lava Shark 5G బడ్జెట్ యూజర్ల కోసం హాట్ ఆఫర్ అవుతోంది.
- ధర: ₹7,999
- డిస్‌ప్లే: 6.7” HD డిస్‌ప్లే.
- ప్రాసెసర్: 2.4 GHz Clock Speed
- కెమెరా: వెనుక 13MP, ముందు 5MP కెమెరా.
- బ్యాటరీ: 5000mAh పైగా.
- సాఫ్ట్‌వేర్: Android 15 – క్లీన UI, బ్లోట్‌వేర్ లేకుండా.
కంపారిజన్ టేబుల్
| ఫోన్ మోడల్ | ధర | డిస్‌ప్లే | ప్రాసెసర్ | కెమెరా | బ్యాటరీ | సాఫ్ట్‌వేర్ |
| POCO C75 5G | ₹7,699 – ₹8,000 | 6.88” HD+, 90Hz | Snapdragon 4s Gen 2 | 50MP + 5MP | 5160mAh, 10W | Android 14 (MIUI), Android 15 అప్‌డేట్ |
| Redmi A4 5G | ₹7,998 | 6.88” IPS LCD HD+ | Snapdragon 4s Gen 2 | 50MP + 5MP | 5160mAh, 18W | Android 14 |
| Infinix Hot 50 5G | ₹8,000 లోపు | 6.7” HD+ | Dimensity 6300 5G | 48MP + 8MP | 5000mAh | Android 14 |
| Lava Shark 5G | ₹7,999 | 6.7” HD | 2.4 MHz processor | 13MP + 5MP | 5000mAh+ | Android 15 (Clean UI) |
చివరి మాట
₹8,000 లోపు 5G ఫోన్లు చాలా అరుదు. కానీ POCO, Redmi, Infinix, Lava మోడల్స్ మాత్రం యూజర్లకు మంచి ఆప్షన్స్ ఇస్తున్నాయి. పెర్ఫార్మెన్స్ కోసం POCO C75, Redmi A4 బెస్ట్, గేమింగ్ కోసం Infinix Hot 50 సరిపోతుంది. ఇక క్లీన Android అనుభవం కావాలనుకునే వారికి Lava Shark 5G బెస్ట్ పిక్.
👉 మరి మీరు ఏది కొనాలని ప్లాన్ చేస్తున్నారు? Poco, Redmi, Infinix లేదా మన Lava? 😍















