Aadhar Mobile Number Update Online: ఇక నుంచి ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చే సూపర్ ఫీచర్ – UIDAI సెన్సేషన్ అప్‌డేట్

R V Prasad

By R V Prasad

Updated On:

aadhar mobile number update online

Join Telegram

Join

Join Whatsapp

Join

ఆధార్‌ కార్డ్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ మార్చడానికి ఎప్పటినుంచో ప్రజలు ఎదురుచూస్తున్న సౌలభ్యాన్ని UIDAI చివరకు అందించింది.
ఇకపై Aadhar Mobile Number Update Online ద్వారా ఇంట్లో కూర్చుని చేసుకునే అవకాశం వచ్చింది.

UIDAI (Unique Identification Authority of India) ఆధార్ యాప్‌లో ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్‌తో, ఇక ఆధార్ సెంటర్‌కి వెళ్లకుండా, ఎలాంటి క్యూల్లో నిలబడకుండా, డాక్యుమెంట్లతో తిరుగకుండా– నేరుగా మీ మొబైల్ ఫోన్ నుంచే Aadhar Mobile Number Update Online లో చేయగలుగుతారు.

Aadhar Mobile Number Update Online ద్వారా ఇంటి నుంచే

అంటే, OTP + Face Authentication కలయికతో ఇంటి నుంచే మీ ఆధార్ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఇది ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్‌కు భారీ మార్పు. ఇప్పటిదాకా ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్ మార్పు తప్పనిసరిగా ఆధార్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి మాత్రమే చేయాల్సి వచ్చేది. అదే ఇప్పుడు ఆధార్ యాప్ ద్వారానే ఆన్‌లైన్‌లో పూర్తి చేయడానికి అవకాశం వచ్చింది.

ఎందుకు ఈ కొత్త Aadhar Mobile Number Update ఫీచర్ అవసరం?

ప్రస్తుతం:

  • మొబైల్ నంబర్ అప్‌డేట్ కోసం తప్పనిసరిగా ఫిజికల్ బియోమెట్రిక్ వెరిఫికేషన్ అవసరం
  • అందుకే వినియోగదారు సెంటర్‌కి వెళ్లాలి
  • సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది చాలా కష్టమైన పని
  • అపాయింట్‌మెంట్ దొరకడం సమస్య
  • సెంటర్‌లో క్యూలు పెద్దవి
  • ఏ చిన్న పొరపాటు జరిగినా తిరిగి రావాల్సి ఉండేది

ఈ సమస్యలను పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో UIDAI ఈ Aadhar Mobile Number Update Online ద్వారా ఇంటి నుంచే చేసే సర్వీస్‌ను ప్రవేశపెట్టింది.

Aadhar Mobile Number Update – కొత్త ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది?

UIDAI వివరించిన విధంగా, ఈ కొత్త ఫీచర్ రెండు కీలక స్టెప్‌లపై ఆధారపడి ఉంటుంది:

1. OTP వెరిఫికేషన్

  • మీ ఆధార్‌కు ప్రస్తుతం లింక్ అయి ఉన్న నంబర్‌కు లేదా
  • మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న కొత్త మొబైల్ నంబర్‌కు

ఒక OTP వస్తుంది.
ఆ OTP ద్వారా మొదటి స్థాయి వెరిఫికేషన్ పూర్తవుతుంది.

2. Face Authentication

ఇది ఆధార్ యాప్‌లో ఉన్న ఫేస్ వెరిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

మీ ముఖాన్ని స్కాన్ చేసి:

  • ఫోటో
  • బయోమెట్రిక్ డేటా
  • ఆధార్ రికార్డ్‌లోని వివరాలతో

సిస్టమ్ సరిపోల్చి గుర్తింపు నిర్ధారిస్తుంది.

UIDAI ప్రకారం, ఈ రెండు స్టెప్‌లు కలిపితే ఫిజికల్ వెరిఫికేషన్‌కి సమానమైన భద్రత లభిస్తుంది, అందుకే సెంటర్ వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త పద్ధతి పనిచేస్తుంది.

Aadhar Mobile Number Update – ఇక డాక్యుమెంట్లు అవసరం లేదు

UIDAI ప్రకటనల ప్రకారం, ఈ కొత్త సిస్టమ్ వల్ల:

  • పేపర్ డాక్యుమెంట్ల కాపీలు అవసరం లేదు
  • అప్లికేషన్ ఫార్మ్స్ అవసరం లేదు
  • సెంటర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు
  • క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేదు

అంటే మొత్తం ప్రాసెస్ పూర్తిగా స్మార్ట్‌ఫోన్‌లోనే జరుగుతుంది.

Aadhar Mobile Number Update – ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది?

మీరు Play Store లేక App Store నుండి కొత్త Aadhar App డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అంటే ప్రస్తుతానికి ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది .

Aadhar Mobile Number Update – అవసరమయ్యేవి ఏమిటి?

కొత్త ఫీచర్ ద్వారా మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడానికి అవసరమయ్యేవి:

  • ఆధార్ నంబర్
  • కొత్త మొబైల్ నంబర్ మరియు Old మొబైల్ నెంబర్
  • ఫేస్ ఆథెంటికేషన్‌కు సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్
  • Aadhaar App

ఇంతే.
డాక్యుమెంట్లేమీ అవసరం లేదు.

Aadhar Mobile Number Update – ఎవరికీ ఇది పెద్ద ఉపశమనం అవుతుంది?

1. సీనియర్ సిటిజన్స్

సెంటర్‌కి వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది.

2. దివ్యాంగులు

ఇంటి నుంచే ప్రాసెస్ పూర్తి చేయడం పెద్ద ప్రయోజనం.

3. గ్రామాలు & దూర ప్రాంతాల ప్రజలు

సెంటర్ దూరంగా ఉండటం వల్ల రోజంతా ప్రయాణం చేయాల్సి వచ్చేది.

4. మొబైల్ నంబర్ పోయిన వారు

లాస్ట్ / బ్లాక్ అయిన నంబర్‌ని రీప్లేస్ చేయడం ఇలాగే సులభం.

5. ఉద్యోగస్తులు

ఆఫీసు నుండి సెలవు తీసుకుని సెంటర్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండేది, అది ఇక ఉండదు.

ప్రస్తుతం ఉన్న సిస్టమ్‌తో పోలిస్తే ఏంటి తేడా?

సెంటర్‌కి వెళ్లాలిఇంటి నుంచే అప్‌డేట్ చేయవచ్చు
డాక్యుమెంట్లు తప్పనిసరిడాక్యుమెంట్లు అవసరం లేదు
బయోమెట్రిక్ వెరిఫికేషన్ సెంటర్‌లోఫేస్ ఆథెంటికేషన్ యాప్‌లోనే
అపాయింట్‌మెంట్ అవసరంఅవసరం లేదు
క్యూలు, సమయం ఎక్కువ5 నిమిషాల్లో పూర్తి

UIDAI కొత్త అప్‌డేట్ – డిజిటల్ ఐడెంటిటీకి మరో అడుగు ముందుకు

ఆధార్ మొబైల్ నంబర్ అనేది:

  • UPI
  • బ్యాంక్ KYC
  • DBT సబ్సిడీలు
  • PAN–Aadhaar లింక్
  • DigiLocker
  • EPFO
  • ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్

వంటి అన్ని కీలక సేవలకు గేట్‌వే.

అందుకే Aadhar Mobile Number Update Online ద్వారా ఇంటి నుంచే చేయగలగడం చాలా పెద్ద మార్పు.

UIDAI ప్రకారం, ఈ డిజిటల్ ఇంటిగ్రేషన్ దేశవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులకి భారీ ఉపశమనం అందిస్తుంది.

సారాంశం

UIDAI రూపొందిస్తున్న ఈ కొత్త ఫీచర్ వల్ల
Aadhar Mobile Number Update Online ద్వారా ఇకపై:

  • సులభం
  • అందుబాటు
  • వేగవంతం
  • డాక్యుమెంట్‌ఫ్రీ
  • సెంటర్‌ఫ్రీ
  • పూర్తిగా డిజిటల్

అవుతుంది.

భారతదేశంలో డిజిటల్ ఐడెంటిటీ సిస్టమ్‌లో ఇది ఒక గేమ్-చేంజర్‌గా మారబోతోంది.

Aadhar Mobile Number Update Online అనే దానిగురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో లింక్ క్రింద ఇచ్చాను చుడండి.

R V Prasad

R V Prasad

R V Prasad is the founder and editor of rvprasadtech.com & @rvprasadtech YouTube Channel. He writes daily about Trending Tech New Updates, Railway Updates and trending news in Telugu. With a strong focus on authenticity and public needs, his mission is to make useful information easily available to every reader.

Leave a Comment