ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ జీవన్ ప్రమాణ పత్రం (Life Certificate) సమర్పించాల్సిందే. కానీ ఇప్పుడు Digital Life Certificate Online ద్వారా Submit చేయడం చాలా సులభమైంది. ఇంట్లో నుంచే, మొబైల్ ఫోన్‌తో Face Authentication ద్వారా మీరు మీ Life Certificateను Online లో Submit చేసుకోవచ్చు.
ఈ ఆన్లైన్ విధానం ద్వారా బ్యాంక్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం రెండు యాప్స్ — Aadhaar Face RD మరియు Jeevan Pramaan Face App — డౌన్లోడ్ చేస్తే చాలు! ఈ యాప్స్‌తో మీరు Jeevan Pramaan Online Submit Process సులభంగా పూర్తి చేయవచ్చు.
Table of Contents
- 1 Step 1: Aadhaar Face RD మరియు Jeevan Pramaan App ఇన్స్టాల్ చేయండి
- 2 Step 2: ఆపరేటర్ ఆథెంటికేషన్ చేయాలి
- 3 Step 3: పెన్షన్‌దారుల వివరాలు నమోదు చేయడం
- 4 Step 4: Face Scan చేయడం – Face Scan సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఈ టిప్స్ Follow అవ్వండి
- 5 Step 5: ధృవీకరణ సందేశం & సర్టిఫికేట్ డౌన్లోడ్
- 6 Why Digital Life Certificate Submit Online is Important for Pensioners
- 7 Face RD తో Life Certificate Online Submit చేయడంలో వచ్చే సాధారణ సమస్యలు
- 8 ముఖ్యమైన సూచనలు:
- 9 సంక్షిప్తంగా చెప్పాలంటే…
- 10 Latest Updates
Step 1: Aadhaar Face RD మరియు Jeevan Pramaan App ఇన్స్టాల్ చేయండి
మొదటగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో Google Play Store ఓపెన్ చేయండి.
అందులో ఈ రెండు యాప్స్ ఇన్స్టాల్ చేయండి:
- Aadhaar Face RD App
- Jeevan Pramaan Face App (Version 3.6.3 లేదా అంతకంటే తాజా వెర్షన్)
మీ మొబైల్లో కనీసం 5MP ఫ్రంట్ కెమెరా మరియు స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
ఇవి లేకుంటే Life Certificate Submit Online with Face RD ప్రాసెస్ సక్సెస్ కాకపోవచ్చు.
Step 2: ఆపరేటర్ ఆథెంటికేషన్ చేయాలి
ఇప్పుడే మీరు ఇన్స్టాల్ చేసిన Jeevan Pramaan Face App ఓపెన్ చేయండి.
తర్వాత ఈ వివరాలు నమోదు చేయండి:
- మీ ఆధార్ నంబర్
- మొబైల్ నంబర్
- ఇమెయిల్ అడ్రెస్
తర్వాత “Submit” బటన్‌పై క్లిక్ చేయండి.
మీకు ఒక OTP SMS లేదా ఇమెయిల్ ద్వారా వస్తుంది — దానిని ఎంటర్ చేసి మీ వివరాలను వెరిఫై చేయండి.
తర్వాత యాప్ మీ Face Scan కోసం అడుగుతుంది.
Camera Access అనుమతించండి మరియు స్క్రీన్‌పై చూపిన సూచనల ప్రకారం మీ ముఖం స్కాన్ చేయండి.
ఇది పూర్తయిన తర్వాత మీరు ఆపరేటర్ ఆథెంటికేషన్ పూర్తి చేసినట్లే.
Step 3: పెన్షన్‌దారుల వివరాలు నమోదు చేయడం
ఆపరేటర్ ఆథెంటికేషన్ పూర్తయిన వెంటనే యాప్ Pensioner Authentication Page కి తీసుకువెళ్తుంది.
ఇక్కడ మరోసారి మీ Aadhaar Number, Mobile Number మరియు e-mail id నమోదు చేసి “Submit” చేయండి.
మళ్లీ OTP వస్తుంది – దానిని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
తర్వాత ఈ వివరాలను నమోదు చేయాలి:
- పెన్షన్‌దారు పేరు
- పెన్షన్ రకం (Service/Family Pension/Others)
- PPO Number (Pension Payment Order)
- Pension Account Number
- Disbursing Agency (బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పేరు)
తరువాత డిక్లరేషన్ బాక్స్‌ని టిక్ చేసి “Submit” పై క్లిక్ చేయండి.
ఇప్పుడు యాప్ మీకు Face Scan Permission అడుగుతుంది — దాన్ని అప్రూవ్ చేయండి.
Step 4: Face Scan చేయడం – Face Scan సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఈ టిప్స్ Follow అవ్వండి
Life Certificate Online లో Face RD ద్వారా Submit చేసే సమయంలో ఫేస్ స్కాన్ చాలా కీలకం.
దీని కోసం మీరు ఈ సూచనలను పాటించండి:
- బాగా వెలుతురు ఉన్న చోట కూర్చోండి
- కెమెరాకు నేరుగా ఎదురుగా చూడండి
- ముఖం చుట్టూ నీడలు లేకుండా చూసుకోండి
- న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ ఉంచండి (నవ్వకండి లేదా కనుబొమ్మలు ఎత్తకండి)
- మొబైల్‌ను కదలకుండా ఉంచి ఫేస్ స్కాన్ పూర్తి చేయండి
స్కాన్ సక్సెస్ అయితే, యాప్ ఆటోమేటిక్‌గా మీ Digital Life Certificate Online Submit పూర్తి చేస్తుంది.
Step 5: ధృవీకరణ సందేశం & సర్టిఫికేట్ డౌన్లోడ్
ఫేస్ స్కాన్ పూర్తయిన వెంటనే యాప్‌లో “Life Certificate Submitted Successfully” అనే మెసేజ్ వస్తుంది.
అదే సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి ఒక SMS వస్తుంది.
ఆ SMS లో Digital Life Certificate (DLC) డౌన్లోడ్ లింక్ ఉంటుంది.
దానిని ఓపెన్ చేసి మీరు మీ Digital Life Certificate ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Why Digital Life Certificate Submit Online is Important for Pensioners
- పెన్షన్ నిరంతరం కొనసాగడానికి ప్రతి సంవత్సరం Life Certificate తప్పనిసరి.
- బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా Jeevan Pramaan Submit Online for Pensioners తో ఇంట్లో నుంచే సులభంగా చేయవచ్చు.
- ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా బయోమెట్రిక్ డివైజ్ అవసరం లేకుండా ప్రాసెస్ పూర్తవుతుంది.
- Digital Life Certificate Online Submit చేయడం వల్ల పేపర్ వర్క్ తగ్గి సమయం ఆదా అవుతుంది.
Face RD తో Life Certificate Online Submit చేయడంలో వచ్చే సాధారణ సమస్యలు
కొన్ని సందర్భాల్లో యాప్ ఫేస్ స్కాన్ గుర్తించకపోవచ్చు.
అటువంటి సందర్భాల్లో ఈ టిప్స్ ప్రయత్నించండి:
- ఇంటర్నెట్ కనెక్షన్ స్టేబుల్‌గా ఉందో లేదో చూడండి.
- ఫోన్ కెమెరా లెన్స్ క్లియర్‌గా ఉందో లేదో పరిశీలించండి.
- మళ్లీ Aadhaar Face RD App అప్డేట్ చేసి ప్రయత్నించండి.
- వెలుతురు సరిపడేలా చూసుకోండి.
ముఖ్యమైన సూచనలు:
- మీరు ఉపయోగిస్తున్న మొబైల్ Android 9.0 లేదా అంతకంటే పై వెర్షన్ ఉండాలి.
- యాప్ వెర్షన్ 3.6.3 లేదా లేటెస్ట్ కావాలి.
- OTP సమయానికి వస్తుందో లేదో చెక్ చేయండి.
- ప్రతి స్టెప్‌లో వచ్చే మెసేజ్‌లు చదివి కొనసాగించండి.
సంక్షిప్తంగా చెప్పాలంటే…
Digital Life Certificate Online Submit ప్రాసెస్‌ను ప్రభుత్వం చాలా సులభం చేసింది.
పెన్షన్‌దారులు ఇప్పుడు బ్యాంక్ లేదా కార్యాలయానికి వెళ్లకుండా, కేవలం మొబైల్‌తోనే Jeevan Pramaan Online ద్వారా Submit చేయవచ్చు.
Face RD టెక్నాలజీతో ఈ సర్వీస్ మరింత వేగంగా, సురక్షితంగా మారింది.
కాబట్టి మీరు ఇంకా చేయకపోతే, వెంటనే Aadhaar Face RD మరియు Jeevan Pramaan Face App డౌన్లోడ్ చేసి, మీ Life Certificate Online Submit with Face RD ద్వారా పూర్తి చేయండి.
ఈ Complete Process వీడియో రూపం లో కావాలనుకుంటే మన Official YouTube Channel లో ఉంటుంది చూడొచ్చు, క్రింద వీడియో లింక్ ఇచ్చాను ఇక్కడి నుండి కూడా చూడొచ్చు. ఇలాంటి Latest Tech Updates కోసం Regular గా మన Website, Telegram మరియు WhatsApp Channel లో Join అవ్వండి. ధన్యవాదాలు…















