October 1st నుంచి Indian Railway New Online Booking Rules అమలు (1st 15 Minuit’s) పూర్తి వివరాలు

R V Prasad

By R V Prasad

Published On:

indian railways new online booking rules

Join Telegram

Join

Join Whatsapp

Join

భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ బుకింగ్ చేస్తూ సులభంగా టికెట్లు బుక్ చేసుకునేవారు. అయితే కొందరు మధ్యవర్తులు, ఏజెంట్లు ఈ సిస్టమ్‌ని దుర్వినియోగం చేస్తున్నారని రైల్వే గుర్తించింది. అందుకే ఇకపై దానికి చెక్ పెట్టేలా కొత్త రూల్‌ని అమలు చేయనుంది. అక్టోబర్ 1, 2025 నుంచి Indian Railway New Online Booking Rules అనే నిబంధన అమల్లోకి రానుంది.

Indian Railway New Online Booking Rules ఏమిటి?

ఇకపై IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో టికెట్లు బుక్ చేయాలంటే తప్పనిసరిగా Aadhar Authentication చేయాలి. Aadharతో లాగిన్ కాని వారు ఈ టైమ్‌లో టికెట్ బుక్ చేసుకోలేరు.

ఈ రూల్‌ని ప్రవేశపెట్టడం వెనుక ముఖ్య కారణం దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే. టికెట్లు ఓపెన్ అవగానే ఏజెంట్లు లేదా సాఫ్ట్‌వేర్ ద్వారా ఎక్కువ టికెట్లు బుక్ చేసి, వాటిని అధిక ధరకు అమ్మే పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిజమైన ప్రయాణికులకు టికెట్ దొరకడం కష్టమవుతోంది.

కౌంటర్ బుకింగ్‌కి మార్పులేదట

రైల్వే అధికారులు స్పష్టం చేశారు: కంప్యూటరైజ్డ్ PRS కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకునే వారికి ఎలాంటి మార్పులు లేవు. ముందు ఉన్నట్లే కౌంటర్ టైమింగ్స్ కొనసాగుతాయి. కేవలం ఆన్‌లైన్ రిజర్వేషన్‌లోనే ఈ కొత్త రూల్ వర్తిస్తుంది.

ఏజెంట్లపై పాత రూల్ కొనసాగుతుంది

ఇప్పటికే ఏజెంట్లకు ఒక నిబంధన అమల్లో ఉంది. అంటే రిజర్వేషన్ ఓపెన్ అయిన మొదటి 10 నిమిషాల్లో ఏజెంట్లు టికెట్లు బుక్ చేయలేరు. ఈ రూల్ యథావిధిగా కొనసాగుతుంది. అంటే మొదటి 10 నిమిషాల్లో ఏజెంట్లకు ఎలాంటి అవకాశం లేదు, తరువాత 5 నిమిషాల్లో మాత్రం ఆధార్‌తో లాగిన్ అయ్యే సాధారణ ప్రయాణికులు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోగలరు.

Technical Updates సిద్ధం

సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS), IRCTC ఇప్పటికే కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌పై పని చేస్తున్నాయి. అక్టోబర్ 1కి ముందు సిస్టమ్‌ని పూర్తిగా అప్‌డేట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే జోనల్ రైల్వేలకు కూడా ప్రయాణికుల్లో అవగాహన కల్పించమని సూచించారు.

ఎందుకు ఈ రూల్?

Indian Railway ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు ఉపయోగించే సర్వీస్. అయితే, కొన్ని సందర్భాల్లో టికెట్లు ఓపెన్ కాగానే కేవలం కొన్ని నిమిషాల్లోనే మొత్తం బుక్ అయిపోతున్నాయి. కారణం ఏజెంట్లు సాఫ్ట్‌వేర్ ఉపయోగించి టికెట్లు బల్క్‌గా రిజర్వ్ చేసుకోవడమే. తరువాత వాటిని ఎక్కువ డబ్బు పెట్టి అమ్ముతున్నారు. దీనివల్ల సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు రైల్వే ఈ ఆధార్ ఆథెంటికేషన్ రూల్‌ను తీసుకొస్తోంది.

ప్రయోజనాలు

  • నిజమైన ప్రయాణికులు ప్రాధాన్యం పొందుతారు.
  • టికెట్ రాకెట్‌యేరింగ్ తగ్గుతుంది.
  • ఆన్‌లైన్ రిజర్వేషన్ సిస్టమ్‌లో పారదర్శకత పెరుగుతుంది.
  • కేవలం అసలైన ఆధార్ ఉన్నవారే మొదటి 15 నిమిషాల్లో టికెట్లు పొందగలరు.

అసౌకర్యం ఎక్కడ?

కొంతమందికి ఆధార్ లింక్ చేయకపోతే లేదా ఆథెంటికేషన్ సమస్యలు ఉంటే మొదటి 15 నిమిషాల్లో టికెట్ బుక్ చేసుకోలేరు. అయితే తరువాత మామూలుగా లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేసుకోవచ్చు.

రైల్వే సూచన

Railway అధికారులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు: ఈ రూల్ కేవలం Online Bookingకే వర్తిస్తుంది. కౌంటర్ బుకింగ్ చేసే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే జోనల్ రైల్వేలు త్వరలో ప్రయాణికులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తాయని చెప్పారు.

👉 మొత్తంగా, అక్టోబర్ 1 నుంచి Online Ticket Reservationలో పెద్ద మార్పు రానుంది. మొదటి 15 నిమిషాల్లో టికెట్ కావాలంటే ఆధార్ తప్పనిసరి. ఈ కొత్త రూల్ అమలుతో టికెట్ బ్లాక్ మార్కెటింగ్, రాకెట్‌యేరింగ్‌కి చెక్ పడే అవకాశం ఉంది.

R V Prasad

R V Prasad

R V Prasad is the founder and editor of rvprasadtech.com & @rvprasadtech YouTube Channel. He writes daily about Trending Tech New Updates, Railway Updates and trending news in Telugu. With a strong focus on authenticity and public needs, his mission is to make useful information easily available to every reader.

Leave a Comment