Nano Banana Trend: ఒక్క ఫోటోతోనే మీ 3D Figurines – Google Gemini Ai కొత్త మ్యాజిక్!

R V Prasad

By R V Prasad

Published On:

nano banana ai 3d figurines telugu

Join Telegram

Join

Join Whatsapp

Join

ఇంటర్నెట్‌లో కొత్త హడావిడి: “Nano Banana” ట్రెండ్

ఇంటర్నెట్‌లో ప్రతి వారం ఒక కొత్త Trend పుట్టుకొస్తుంది. కానీ ఈసారి గూగుల్ Gemini తెచ్చిన “Nano Banana” ట్రెండ్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు ఒక్క ఫోటోతోనే హైపర్-రియలిస్టిక్ 3D ఫిగరిన్ తయారు చేసుకోవచ్చని వింటే, ఎవ్వరూ మిస్ అవ్వరు కదా!

Nano Banana అంటే ఏమిటి?

“Nano Banana” అనేది గూగుల్ Geminiలో అందుబాటులో ఉన్న కొత్త AI ఫీచర్. దీని ద్వారా మనం, మన ఫ్రెండ్స్, సెలబ్రిటీలు, లేదా పెంపుడు జంతువుల ఫోటోను అప్‌లోడ్ చేస్తే, ఆ ఇమేజ్ ఆధారంగా నిజంగానే ఉన్నట్టుగా కనిపించే 3D మినియేచర్ ఫిగరిన్‌ను తయారు చేస్తుంది.

ఈ ఫిగరిన్‌కి ట్రాన్స్‌పరెంట్ అక్రిలిక్ బేస్, అలాగే ప్యాకేజింగ్ బాక్స్ కూడా కనిపిస్తుంది. వీటిని చూసే వాళ్లకు నిజంగానే షాపుల్లో అమ్మే కలెక్టిబుల్ టాయ్స్‌లా అనిపిస్తుంది.

ఎందుకు వైరల్ అవుతోంది?

ఈ ట్రెండ్ పాపులర్ అవ్వడానికి ప్రధాన కారణం –

  • ఫ్రీగా అందుబాటులో ఉండటం
  • ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేకపోవడం
  • కేవలం ఫోటోతోనే అద్భుతమైన 3D ఫలితం రావడం

సోషల్ మీడియాలో చాలా మంది తమ ఫిగరిన్స్ షేర్ చేస్తూ, “Nano Banana“ని Trend చేసి వైరల్ చేస్తున్నారు. ఇండియాలోనూ ఇది మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

గూగుల్ అధికారికంగా ప్రకటించింది: “Gemini యాప్‌లో ఇమేజ్ క్రియేషన్, ఎడిటింగ్ ప్రతి ఒక్కరికీ పూర్తిగా ఉచితం” అని.

Nano Banana 3D Figurines ఎలా క్రియేట్ చేయాలి? (Step-by-Step Guide)

  • Step 1: ముందుగా [Google Gemini] లేదా [Google AI Studio] ఓపెన్ చేయండి.
  • Step 2: మీకు కావాల్సిన ఏదైనా ఫోటోను అప్‌లోడ్ చేయండి.
  • Step 3: ఈ ప్రాంప్ట్‌ని కాపీ చేసి వేసేయండి:

“Create a 1/7 scale commercialized figurine of the characters in the picture, in a realistic style, in a real environment. The figurine is placed on a computer desk. The figurine has a round transparent acrylic base, with no text on the base. The content on the computer screen is a 3D modeling process of this figurine. Next to the computer screen is a toy packaging box, designed in a style reminiscent of high-quality collectible figures, printed with original artwork. The packaging features two-dimensional flat illustrations”

Step 4: ఇప్పుడు Generate బటన్ నొక్కండి. కొన్ని సెకన్లలోనే మీ 3D Figurines స్క్రీన్ మీద కనబడుతుంది.

Step 5: ఫలితం మీకు నచ్చకపోతే, ఫోటో మార్చి మళ్లీ ప్రయత్నించవచ్చు లేదా ప్రాంప్ట్‌లో చిన్న మార్పులు చేయవచ్చు.

Nano Banana స్పెషల్ ఫీచర్స్

  • 1/7 స్కేల్ ఫిగరిన్: ఇది రియల్ కలెక్టిబుల్ టాయ్‌లా కనిపిస్తుంది.
  • అక్రిలిక్ బేస్: Figurine కింద ట్రాన్స్‌పరెంట్ రౌండ్ బేస్ ఉంటుంది.
  • ప్యాకేజింగ్ బాక్స్: టాయ్ ప్యాకేజింగ్ స్టైల్‌లో, ఆర్ట్‌వర్క్‌తో ఉన్న బాక్స్ కూడా కనిపిస్తుంది.
  • మోడలింగ్ ప్రీవ్యూ: కంప్యూటర్ స్క్రీన్‌పై మీ ఫిగరిన్ 3D మోడలింగ్ ప్రాసెస్ చూపిస్తుంది.

ఎవరైనా ఉపయోగించవచ్చా?

అవును. ఎవరైనా Free గా Google Gemini యాప్‌ ద్వారా ఈ ట్రెండ్‌లో భాగం కావచ్చు. పేమెంట్ లేదా సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.

ఫైనల్ వర్డ్స్

“Nano Banana” ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బజ్ అవుతోంది. మీ ఫోటోను కేవలం ఒక క్లిక్‌తోనే రియలిస్టిక్ 3D Figurinesగా చూడటం నిజంగా ఒక మ్యాజిక్ అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే, గూగుల్ Geminiలోకి వెళ్లి మీ ఫోటో అప్‌లోడ్ చేసి, ఇచ్చిన ప్రాంప్ట్ వేసేయండి చాలు!

ఇక మీరు కూడా మీ మినీ ఫిగరిన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తే, ఫ్రెండ్స్ మస్త్ సర్‌ప్రైజ్ అవ్వడం ఖాయం!

ఈ సమాచారం వీడియో రూపం లో కావాలనుకుంటే ఈ క్రింది వీడియో చుడండి.

R V Prasad

R V Prasad

R V Prasad is the founder and editor of rvprasadtech.com & @rvprasadtech YouTube Channel. He writes daily about Trending Tech New Updates, Railway Updates and trending news in Telugu. With a strong focus on authenticity and public needs, his mission is to make useful information easily available to every reader.

Leave a Comment