Table of Contents
15000mAh బ్యాటరీ + కూలింగ్ ఫ్యాన్‌తో Realme. కానీ కొనాలంటే ఇప్పుడు కుదరదు!
రియల్‌మీ మొబైల్ బ్రాండ్‌కు కొత్త ఫోన్లు రిలీజ్ చేయడం కొత్తేమీ కాదు. నెలకోసారి ఏదో కొత్త మోడల్‌తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈసారి రియల్‌మీ కేవలం మార్కెట్‌లోకి తీసుకొచ్చే ఫోన్లు కాకుండా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రత్యేకంగా తయారుచేసిన “కాన్సెప్ట్ ఫోన్లు” రెండు చూపించి అందరికీ షాక్ ఇచ్చింది. చైనాలో జరిగిన Realme 828 Festival లో ఈ కాన్సెప్ట్ ఫోన్లను ప్రదర్శించింది. ఈ రెండు ఫోన్లూ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా లేవు కానీ, వాటిలో ఉన్న ఫీచర్లు చూస్తే భవిష్యత్తులో ఇవే ట్రెండ్ అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఫోన్లు ప్రత్యేకంగా లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం చూస్తున్నవాళ్లకు, గేమింగ్ ఫ్యాన్స్ కోసం డిజైన్ చేయబడ్డాయి అని చెప్పుకోవచ్చు.
15000mAh బ్యాటరీతో పవర్ బ్యాంక్ ఫీచర్?
మొదటి కాన్సెప్ట్ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే 15,000mAh బ్యాటరీ. ఇది సాధారణంగా మనం స్మార్ట్‌ఫోన్‌లో చూడని స్థాయి బ్యాటరీ కెపాసిటీ. ఈ ఫోన్ వాడితే మీరు ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే, ఆ బ్యాటరీ 5 రోజులు వరకూ నిలుస్తుందట. అంతేకాకుండా, 25 సినిమాలు వరుసగా చూడగలుగుతారు అంటోంది రియల్‌మీ. ఒక్కో సినిమా 1.5 గంటలు ఉన్నా కూడా ఎటువంటి చార్జింగ్ అవసరం లేకుండా చూడగలగడం అంటే ఆశ్చర్యమే కదా! ఇంకా పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్ లాగా కూడా వాడొచ్చు. అంటే ఇతర ఫోన్లు, గాడ్జెట్లు కూడా దీని ద్వారా ఛార్జ్ చేయొచ్చు. ఫోన్ డిజైన్ పరంగా చూస్తే ఇది చాలా స్లిమ్‌గా ఉండడం గమనార్హం. బ్యాక్సైడ్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ తో పాటు “15000mAh” అని bold గా ప్రింట్ చేసిన లుక్ కూడా స్టైలిష్‌గా కనిపిస్తోంది.
గేమర్స్ కోసం కూలింగ్ ఫ్యాన్ ఫోన్
రెండో కాన్సెప్ట్ ఫోన్ గేమింగ్ ప్రియుల కోసం రూపొందించబడింది. ఇందులో ఇన్‌బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ ఉందని కంపెనీ చెబుతోంది. ఇది ఫోన్ ఎడమ వైపు ఉండే ఎయిర్ వెంట్ ద్వారా వేడి బయటికి పంపి, ఫోన్ ఉష్ణోగ్రతను 6 డిగ్రీల వరకూ తగ్గిస్తుంది. దీని వల్ల ఫోన్ హీట్ అవడం తక్కువగా ఉండి, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. గతంలో కూడా కొన్ని గేమింగ్ ఫోన్లలో కూలింగ్ సిస్టమ్‌లు ఉన్నా, ఈసారి రియల్‌మీ ఏకంగా కూలింగ్ ఫ్యాన్‌నునే ఏర్పాటు చేసింది. ఇది ప్రత్యేకించి భారీ గేమింగ్‌కి సెట్ అయ్యేలా ఉంటుందని తెలుస్తోంది.
కానీ, అందులో ఒక చిన్న ట్విస్టు ఉంది…
ఇన్ని అదిరిపోయే ఫీచర్లు ఉన్నా కూడా ఈ ఫోన్లు మీరు ఇప్పుడే కొనలేరు. ఎందుకంటే ఇవి కేవలం కాన్సెప్ట్ మోడల్స్ మాత్రమే. మార్కెట్‌లోకి వస్తాయా? ఎప్పుడు వస్తాయో? ఇంకా ఏ సమాచారం లేదు. కానీ రియల్‌మీ చూపించిన ఈ భవిష్యత్ ఫోన్ల దిశ మాత్రం స్పష్టంగా ఉంది బ్యాటరీ లైఫ్ + గేమింగ్ ఫెర్ఫార్మెన్స్ అనే రెండు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టబోతున్నట్టుగా ఊహించుకోవచ్చు .
మొత్తంగా…
రియల్‌మీ ఈ రెండు కాన్సెప్ట్ ఫోన్ల ద్వారా టెక్ ప్రపంచానికి ఒక క్లారిటీ ఇచ్చింది. పెద్ద బ్యాటరీ కావాలనుకునేవాళ్లకి, గేమింగ్స్ ఆడేవారికి ఇది కచ్చితంగా మంచి న్యూస్. ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇవి ఎలా ఉంటాయో, వాటి స్పెసిఫికేషన్స్ ఏమిటో తెలియాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రం ఖాయం రియల్‌మీ భవిష్యత్తు ఫోన్లను సరదాగా కాకుండా సీరియస్‌గా డిజైన్ చేస్తోందని ఈ ప్రదర్శనతో తెలిసింది.















