“5 ఏళ్ల తర్వాత TikTok తిరిగి ఇండియాలో? AliExpress కూడా అన్‌బ్లాక్ అయిందా? అసలు ఏం జరుగుతోంది?”
2020లో భారత ప్రభుత్వం చైనా యాప్‌లపై మోపిన భారీ నిషేధం ఇప్పుడు వెనక్కి వెళ్లిపోతుందా? మొబైల్ యూజర్లు, టెక్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా TikTok మరియు AliExpress వెబ్సైట్లు భారత్‌లో ఓపెన్ అవుతున్నాయన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది నిజమేనా? TikTok మళ్లీ మీ ఫోన్లోకి వస్తుందా? ఇది కేవలం టెక్నికల్ గ్లిచ్‌లా? అసలు నిషేధం ఎత్తివేశారా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈ బ్లాగ్‌లో చూద్దాం.
Table of Contents
2020లో ప్రారంభమైన చైనా యాప్‌ల బ్యాన్
గల్వాన్ లోయలో జరిగిన భారత్-చైనా ఘర్షణ తర్వాత, జాతీయ భద్రతా పరంగా భారత్ సర్కార్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 200కి పైగా చైనా యాప్‌లు వాటిలో TikTok, WeChat, ShareIt, UC Browser, CamScanner, Mi Video, Viva Video, Helo, Likee, Club Factory, మరియు AliExpress వంటి ప్రముఖ యాప్‌లు కూడా ఉన్నాయి, అన్నింటినీ బ్యాన్ చేసింది. ప్రభుత్వం చెప్పినదేంటంటే, ఈ యాప్‌లు వినియోగదారుల డేటాను చైనా సర్వర్లకు పంపిస్తున్నాయి, ఇది భారత దేశ భద్రతకు ప్రమాదకరమని అభిప్రాయపడింది. అప్పటి నుంచి ఈ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో కనబడకుండా పోయాయి. కొన్ని VPNలతో యాక్సెస్ చేసినా, ప్రభుత్వ నిబంధనల కారణంగా చాలా మంది దూరంగా ఉన్నారు.
ఇప్పుడు పరిస్థితి మారిందా?
అయితే తాజా సమాచారం ప్రకారం, TikTok వెబ్సైట్ మరియు AliExpress వెబ్సైట్లు ఇప్పుడు భారత్‌లో ఓపెన్ అవుతున్నాయి. కొంతమంది యూజర్లు స్క్రీన్షాట్లు షేర్ చేస్తూ – “TikTok ఓపెన్ అవుతుంది”, “AliExpress బ్రౌజ్ అవుతోంది” అంటూ ట్విట్టర్, Reddit, Instagramలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే, యాప్ స్టోర్లలో ఈ యాప్‌లు ఇంకా అందుబాటులో లేవు. అంటే, మొబైల్ యాప్‌లుగా ఉపయోగించడానికి వీలుకాదు. కానీ వెబ్సైట్ ఓపెన్ కావడమే పెద్ద సంచలనం కలిగిస్తోంది.
అయితే… అధికారికంగా నిషేధం ఎత్తేశారా?
ఇంకా భారత ప్రభుత్వం లేదా ఐటీ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఈ బ్యాన్ ఎత్తివేశామన్న ప్రకటన ఇవ్వలేదు. కాబట్టి, ఇది రెండు విధాలుగా చూడవచ్చు:
Technical Error లేదా Geo-block Refresh: కొన్ని సమయంలో DNS లేదా IP ఫిల్టరింగ్ మారితే, వెబ్సైట్లు తాత్కాలికంగా యాక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇది శాశ్వతమైన మార్పు కాదని భావించవచ్చు.
పునఃప్రవేశానికి మొదటి అడుగు?: ByteDance (TikTok parent company) మరియు Alibaba (AliExpress parent) మళ్లీ భారత మార్కెట్లోకి రావడానికి ప్లానింగ్ చేస్తున్నాయా? ఇప్పటికే TikTok పేరుతో కొత్త కంపెనీలు రిజిస్టర్ అవుతున్నాయన్న వార్తలు ఉన్న నేపథ్యంలో, ఇది “లైట్ టెస్ట్” స్టెప్ కావచ్చునని కొంతమంది భావిస్తున్నారు.
TikTok మరియు AliExpress ఇండియాలోకి మళ్లీ వస్తున్నాయా?
TikTok 2020 బ్యాన్‌కి ముందు భారతదేశంలో అతి పెద్ద యూజర్‌బేస్ కలిగిన యాప్, TikTok అంతగా ఫేమస్ కావడానికి ప్రధాన కారణం సులభంగా వీడియోలు షూట్ చేసి ఎడిట్ చేయడం, ఫిల్టర్లు, మ్యూజిక్ మిక్స్‌లు వంటి ఇందులో ఉండటమే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. AliExpress కూడా ఒకప్పుడు భారత్‌లో అతి పాపులర్ చైనా ఈ-కామర్స్ సైట్. చీప్ గాడ్జెట్స్, మొబైల్ అసెసరీస్, డ్రెస్‌లు, టూల్స్ వంటి వాటిని డైరెక్ట్‌గా చైనా నుంచి తక్కు ధరలకు తెప్పించుకునే అవకాశం ఇక్కడ ఉండేది. కానీ ఇప్పుడు మునుపటిలాగే షాపింగ్ చేయొచ్చా అనేది ప్రశ్నార్ధకం.
నెటిజన్ల రియాక్షన్స్ – మిక్స్డ్ ఫీల్
కొంతమంది ఆనందంగా TikTok రీటర్న్కి వెల్కమ్ చెబుతున్నారు. ముఖ్యంగా content creators, మినీ-ఇన్ఫ్లుయెన్సర్లు తమ అకౌంట్లను మళ్లీ యాక్సెస్ చేయగలరా? అని ఆసక్తిగా చూస్తున్నారు. అయితే మరోవైపు, “జాతీయ భద్రత ముందే!” అంటూ పలువురు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
TikTok తిరిగి వస్తే, మీరు వాడతారా?
ప్రస్తుతం TikTok, AliExpress వెబ్సైట్లు ఓపెన్ అవుతున్నాయన్న వార్త నిజమే. కానీ ఇది శాశ్వత మార్పు కాదు. యాప్‌లను పునఃప్రవేశపెట్టాలంటే, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇవ్వాలి. అయితే ByteDance వంటి సంస్థలు మళ్లీ ఇండియా మార్కెట్‌పై కన్నేశాయనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
మీరు చెప్పండి TikTok తిరిగి వస్తే మీరు వాడతారా? లేక ఇంకా బ్యాన్ ఉండాలనే అభిప్రాయమా?
మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి! మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన Website ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి!















