Learn the Benefits of Restarting your Mobile & the Disadvantages of Not Restarting it.
మనం రోజూ ఉపయోగించే మొబైల్‌ను ఎప్పటికప్పుడు రీస్టార్ట్ చేయడం చాలా ముఖ్యమని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది. మొబైల్‌ను రీస్టార్ట్ చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు మరియు రీస్టార్ట్ చేయడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రెగ్యులర్ గా మొబైల్, కంప్యూటర్, లాప్తొప్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, కానీ రీస్టార్ట్ అనేది మనం ఎప్పుడు చేస్తాం అంటే, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు, ఒక అప్లికేషన్ ఇన్స్టాల్చేసినప్పుడు మాత్రమే మనం రీస్టార్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఇలాగె మనం రెగ్యులర్ గా కూడా మొబైల్ ఫోన్ రీస్టార్ట్ చేస్తూ ఉండాలి,
ఎన్ని రోజులకు ఒకసారి రీస్టార్ట్ చేయాలి?
దీనికంటే ముందు కొన్ని ముఖ్యమైన టిప్స్ గురించి తెలుసుకుందాం. మన మొబైల్ స్లో ఎందుకు అవుతుందంటే రెగ్యులర్ గా మన మొబైల్ లో ఏదైతే అప్లికేషన్స్ యూస్ చేస్తుంటాం కదా, ఆ అప్లికేషన్స్ అనేది మొబైల్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి, రన్ అవుతున్నప్పుడు RAM మీద ఎక్కువ భారం పడుతుంది. అంటే మన మొబైల్ లో ఉన్న RAM అనేది ఎంగేజ్ అవుతుంది, ఆలా ఎంగేజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఫోన్ అనేది స్లో అవుతుంది. ఫోన్ స్లో అయినప్పుడు మనకు బ్యాటరీ కూడా Heat అవుతుంది.
1. మీరు ఎప్పుడు అయినా గమనించారా!
మనం రెగ్యులర్ గా ఒక 10 డేస్ 15 డేస్ కంటిన్యూ గా మొబైల్ రీస్టార్ట్ చేయకుండా ఉన్నట్లయితే మన మొబైల్ అనేది లాగ్ అవుతుంది, తర్వాత హ్యాంగ్ అవుతుంది, తర్వాత బ్యాటరీ కూడా త్వరగా అయిపోతుంది, అలాంటప్పుడు మనము కచ్చితంగా రీస్టార్ట్ అనేది చేస్తూ ఉండాలి. అలాగే మన మొబైల్ ను కంటిన్యూ గా వాడుతూ ఉన్నట్లయితే మన మొబైల్ ఫ్రీజ్ కూడా అవుతుంది, మొబైల్ ఫ్రీజ్ అవ్వడం అంటే మనం ఎప్పుడైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు అది ఓపెన్ కాదు. అంటే ఎక్కడ మనం క్లిక్ చేసినా కూడా అది అక్కడే స్ట్రక్ అయిపోతుంది. దాన్నేFreeze అవ్వడం అంటారు, అలా ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా మొబైల్ అనేది రీస్టార్ట్ చేస్తూ ఉండాలి.
2. ఇంకొకటి ఇంపార్టెంట్ అయినా విషయం ఏంటంటే:
మీ మొబైల్ లో నెట్ స్పీడ్ స్లో అయినప్పుడు మనం ఫ్లైట్ మోడ్ లో పెడ్తు ఉంటాం, తర్వాత ఆ ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసిన తర్వాత మన మొబైల్ నెట్ స్పీడ్ గమనించినట్లయితే ఆటోమేటిక్ గా స్పీడ్ పెరుగుతుంది, అంటే ఆ నెట్వర్క్ రీసెట్ అయిందన్న మాట, అలాగే మన ముబైల్ కూడా రిసార్ట్ చేస్తూ ఉండాలి, (మొబైల్ రీస్టార్ట్ అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయడం అంతే). రీస్టార్ట్ అనేది ఎన్ని రోజులకు చేయాలి ఎన్ని వారాలకు చేయాలి ఎన్ని నెలలకు చేయాలి అనేది నేను చివర్లో చెప్తాను.
3. మొబైల్‌ను రీస్టార్ట్ చేయకపోతే కలిగే నష్టాలు:
- ఫోన్ స్లో అవ్వడం: మనం ఉపయోగించే అప్లికేషన్లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల RAM పై భారం పడి ఫోన్ స్లో అవుతుంది.
- బ్యాటరీ వేగంగా తగ్గిపోవడం: బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అప్లికేషన్లు ఎక్కువ బ్యాటరీని ఖర్చు చేస్తాయి. దీంతో బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది.
- మొబైల్ హీట్ ఎక్కడం: ఫోన్ ఎక్కువగా పనిచేయడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది.
- నెట్వర్క్ సమస్యలు: నెట్వర్క్ స్లో అవ్వడం, కాల్ క్వాలిటీ సరిగా లేకపోవడం వంటి సమస్యలు రావచ్చు.
- ఫ్రీజ్ అవ్వడం: కొన్నిసార్లు అప్లికేషన్లు ఓపెన్ కాకుండా ఫోన్ ఫ్రీజ్ అవుతుంది.
- సాఫ్ట్వేర్ బగ్స్: చిన్నపాటి సాఫ్ట్వేర్ బగ్స్ ఫోన్ పనితీరును ప్రభావితం చేస్తాయి.
4. మొబైల్‌ను రీస్టార్ట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
- వేగంగా పనిచేస్తుంది: రీస్టార్ట్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న అప్లికేషన్లు క్లోజ్ అవుతాయి. దీనివల్ల RAM ఖాళీ అయ్యి ఫోన్ స్పీడ్‌గా పనిచేస్తుంది.
- బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది: బ్యాక్‌గ్రౌండ్‌లో అప్లికేషన్లు రన్ కాకపోవడం వల్ల బ్యాటరీ ఎక్కువసేపు పనిచేస్తుంది.
- నెట్వర్క్ మెరుగుపడుతుంది: నెట్వర్క్ సమస్యలు పరిష్కారమై ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది.
- సాఫ్ట్వేర్ సమస్యలు పరిష్కారం: రీస్టార్ట్ చేయడం వల్ల చిన్నపాటి సాఫ్ట్వేర్ బగ్స్ క్లియర్ అవుతాయి.
- జంక్ ఫైల్స్ క్లియర్ అవుతాయి: ఫోన్లో పేరుకుపోయిన అనవసరమైన జంక్ ఫైల్స్ తొలగిపోతాయి.
- అప్డేట్స్ ఇన్స్టాల్ అవుతాయి: ఆపరేటింగ్ సిస్టమ్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్స్ సులభంగా ఇన్స్టాల్ అవుతాయి.
మీ మొబైల్ పనితీరు మెరుగ్గా ఉండాలంటే, కనీసం వారానికి ఒకసారి అయినా రీస్టార్ట్ చేయడం మంచిది. దీనివల్ల ఫోన్ వేడెక్కకుండా, స్లో అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా, నెట్వర్క్ మరియు బ్యాటరీ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
దీని గురించి పూర్తి సమాచారం వీడియో రూపం లో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ నుండి ఒక వీడియో క్రింద పోస్ట్ చేశాను చుడండి.















