PM Kisan 20వ విడత డబ్బులు మీ ఖాతాలో జమ అయిందో లేదో తెలుసుకోండి ఇలా
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 20వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బుని నేరుగా బదిలీ చేశారు. ఈ విడతలో సుమారు 9.7 కోట్ల అర్హత గల రైతులకు రూ. 20,500 కోట్లు జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం, మూడు విడతల్లో, ఒక్కో విడతకు రూ. 2,000 చొప్పున అందించబడుతుంది.
మీ ఖాతాలో డబ్బు జమ అయ్యిందో లేదో తెలుసుకునేందుకు PM-KISAN అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in సందర్శించి, ‘బెనిఫిషియరీ స్టేటస్’ (PM Kisan Beneficiary Status) అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ పథకం యొక్క లాభాలు పొందడానికి, ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాతో Connect అయ్యి ఉండాలి, అలాగే ఇ-కేవైసీ (e-KYC) మరియు భూమి రికార్డుల Certification అవసరమౌతుంది.
2019 ఫిబ్రవరి 24న కేంద్రం ‘పీఎం కిసాన్‘ పథకాన్ని ప్రారంభించింది, దీని ద్వారా ప్రతి ఏడాది ఒక్కో విడత రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో రూ. 6,000 సహాయం అందించాలని లక్ష్యం. ఇప్పటివరకు, 11 కోట్ల మంది రైతులకు 19 విడతల్లో రూ. 3.46 లక్షల కోట్లు అందించబడ్డాయి.
1. 19వ విడత డబ్బు మీ ఖాతాలో జమ అయ్యిందో తెలుసుకోవాలంటే:
ముందుగా PM-KISAN అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/కి వెళ్లండి. కుడి వైపున ఉన్న ఎంపికలలో ‘Know your Status‘ ఆప్షన్ కనిపిస్తుంది.

ఆ ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత, మీ Registration నంబరును నమోదు చేయండి, ఒక OTP వస్తుంది. OTP Confirm అయ్యాక, ‘గెట్ డేటా’ను క్లిక్ చేయండి. మీ Payment Status తెలుస్తుంది.
2. Registration Number మరచిపోయింటే ఇలా చేయండి:
ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తులేకుంటే పక్కన Know your Registration Number అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన Captcha ఉంటుంది Same Captcha ఎంటర్ చేయాలి, తర్వాత Get Mobile OTP మీద క్లిక్ చేయాలి, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది, ఆ OTP ఎంటర్ చేసి Submit చేసిన వెంటనే మీకు Registration Number తెలుస్తుంది.

పీఎం కిసాన్‌కు మీరు రిజిస్టర్ అయినట్లయితే, e-KYC పూర్తిచేసి ఉంటే, మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.
మీరు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ‘బెనిఫిషియరీ స్టేటస్’ కింద ‘బెనిఫిషియరీ లిస్ట్’ ఆప్షన్ ఉంటుంది.
ఈ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, మరొక పేజీకి మీరు మారుతారు. అక్కడ లబ్ధిదారుడి రాష్ట్రం, జిల్లా, మండలం, బ్లాక్, గ్రామాలను ఎంచుకొని ‘గెట్ రిపోర్ట్’ పై క్లిక్ చేస్తే, లబ్ధిదారుల జాబితా మీకు కనిపిస్తుంది.
PM-KISAN హెల్ప్ లైన్ నంబర్ 155261 / 011-24300606 కి కాల్ చేసి కూడా సమాచారాన్ని పొందవచ్చు.















