Tatkal Ticket Booking via RailOne App: Full Guide – Telugu

R V Prasad

By R V Prasad

Updated On:

Tatkal Tickets Booking New Process 2025

Join Telegram

Join

Join Whatsapp

Join

RailOne App: తత్కాల్ టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవడానికి ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఇది ఆల్-ఇన్-వన్ యాప్ ఇందులో అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, రిజర్వేషన్‌లు, మరియు ట్రైన్ ట్రాకింగ్ వంటి సేవలు ఒకే చోట లభిస్తాయి.  గతంలో ఈ సేవలకు వేర్వేరు యాప్‌లు (UTS, IRCTC Rail Connect, Where is my train) ఉపయోగించేవారు.

తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునే విధానం (Tatkal Ticket Booking Process):

  1. యాప్ ఇన్‌స్టాలేషన్ & రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం:
  • మీరు ప్లే స్టోర్ నుండి RailOne Appని ఇన్‌స్టాల్ చేసుకోండి. RailOne యాప్ రిజిస్ట్రేషన్ Process కోసం ఇదే వెబ్సైటు లో “Railway Related” లో RailOne App కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి వివరించాను అది చదవండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి తెలుస్తుంది.
  1. ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి (Pre-requisites):
  • ప్యాసింజర్ వివరాలు యాడ్ చేయండి: తత్కాల్ టిక్కెట్ బుక్ చేయాలనుకుంటున్న వారి వివరాలను (పేరు, వయస్సు, లింగం మొదలైనవి) ముందుగానే “U” ఆప్షన్‌లో “Add Passenger” ద్వారా యాడ్ చేసి పెట్టుకోండి, ఇలా ఉందే యాడ్ చేసి పెట్టుకుంటే తత్కాల్ టికెట్స్ బుక్ చేసే టైం లో సమయం వృధా అవ్వకుండా త్వరగా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
  • R-Walletలో డబ్బులు యాడ్ చేయండి: పేమెంట్ ప్రక్రియ వేగవంతం చేయడానికి, తగినంత డబ్బును R-Walletలో ముందుగానే యాడ్ చేసి పెట్టుకోవడం చాల మంచిది, ఎందుకంటే Tatkal టికెట్స్ బుకింగ్ టైం లో టికెట్ కోసం అమౌంట్ పే చేయాలి, ఆ టైం లో PhonePe, Gpay, Paytm ద్వారా, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. (ఇలా అప్పటికప్పుడు పేమెంట్ చేయడం వల్ల సమయం వృథా అయ్యి, టిక్కెట్లు అయిపోయే అవకాశం ఉంటుంది).
  • డబ్బు యాడ్ చేసే విధానం: R-Wallet లోకి వెళ్లి, “Add” పై క్లిక్ చేసి, కావలసిన మొత్తాన్ని నమోదు చేసి, UPI ద్వారా పేమెంట్ పూర్తి చేయండి (ఉదా: PhonePe, Paytm ,Gpay).
  1. తత్కాల్ టిక్కెట్ బుకింగ్ సమయం: స్లీపర్ క్లాస్ తత్కాల్ టిక్కెట్లు ఉదయం 11:00 గంటలకు ఓపెన్ అవుతాయి. AC క్లాస్ టిక్కెట్లు 10:00 గంటలకు ఓపెన్ అవుతాయి.
  1. బుకింగ్ ప్రక్రియ Sleeper Class (ఉదయం 11:00 గంటలకు):
  • హోమ్ స్క్రీన్కి వెళ్లి, “Reserved” పై క్లిక్ చేయండి.
  • ఫ్రమ్ (From) మరియు టూ (To) లొకేషన్‌లను ఎంచుకోండి.
  • డిపార్చర్ తేదీని ఎంచుకోండి.
  • కోటా (Quota) లో “Tatkal” ని ఎంచుకోండి.
  • “Search” పై క్లిక్ చేయండి.
  • మీ రూట్‌లో ఉన్న ట్రైన్‌ల జాబితా కనిపిస్తుంది, మీకు కావాల్సిన ట్రైన్‌ను ఎంచుకోండి.
  • “See Availability” పై క్లిక్ చేయండి. (ఈ సమయంలో సీట్లు అందుబాటులో లేకున్నా, 11:00 గంటల తర్వాత రీఫ్రెష్ అవుతాయి).
  • 11:00 గంటలు అవ్వగానే వెంటనే రీఫ్రెష్ చేయండి. (చాలా మంది ఒకేసారి ప్రయత్నిస్తారు కాబట్టి కొంచెం సమయం పట్టవచ్చు).
  • అందుబాటులో ఉన్న స్లీపర్ క్లాస్ సీట్లపై క్లిక్ చేయండి.
  • ముందుగా యాడ్ చేసిన ప్యాసింజర్ పేర్లను ఎంచుకోండి లేదా కొత్త ప్యాసింజర్ వివరాలను వేగంగా నమోదు చేయండి.
  • “Review Journey” పై క్లిక్ చేయండి.
  • క్యాప్చాను సరిగ్గా నమోదు చేయండి.
  • “Book Now” పై క్లిక్ చేయండి.
  • పేమెంట్ ఆప్షన్లలో “R-Wallet” ని ఎంచుకొని “Pay using R-Wallet” పై క్లిక్ చేయండి.
  • పేమెంట్ విజయవంతం కాగానే, టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. (ఉదా: S5 లో 47).

చివరి సలహాలు (Final Tips):

  • తత్కాల్ టిక్కెట్లు వేగంగా అయిపోతాయి కాబట్టి, ప్యాసింజర్ వివరాలను మరియు R-Walletలో డబ్బును ముందుగానే సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం.
  • ఇచ్చిన సూచనలను కచ్చితంగా పాటించడం ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఈ కంప్లీట్ ప్రాసెస్ వీడియో రూపంలో కావాలనుకుంటే ఈ క్రింద మన యూట్యూబ్ ఛానల్ (@rvprasadtech) యొక్క వీడియో పెట్టాను చుడండి.

R V Prasad

R V Prasad

R V Prasad is the founder and editor of rvprasadtech.com & @rvprasadtech YouTube Channel. He writes daily about Trending Tech New Updates, Railway Updates and trending news in Telugu. With a strong focus on authenticity and public needs, his mission is to make useful information easily available to every reader.

Leave a Comment