మీరు సైబర్ దాడుల నుండి మీ మొబైల్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ను రక్షించుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు మరియు ముఖ్య అంశాలు :
ఇంటర్నెట్ వాడకం పెరిగిన రోజుల్లో సైబర్ దాడులు (Cyber Attacks) కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మనం వాడే మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ వంటి డివైసులు హ్యాకింగ్, మాల్వేర్, ఫిషింగ్ అటాక్స్‌కు టార్గెట్ అవుతున్నాయి. ముఖ్యంగా పర్సనల్ డేటా, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, పాస్‌వర్డ్స్‌ను సురక్షితంగా ఉంచాలంటే కొన్ని కీలక జాగ్రత్తలు తప్పనిసరి. చాలా మంది తమ డబ్బు మరియు డేటాను కోల్పోతున్నారు. కొన్ని సాధారణ నిర్లక్ష్యాలు మరియు భద్రతా చిట్కాలను పాటించకపోవడం వల్ల ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రింది చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ Mobile లోని Sensitive Data ను కొంతవరకు రక్షించుకోవచ్చు.
Table of Contents
1. పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ :-
- పాస్‌వర్డ్‌లను సేవ్ చేయవద్దు: ఆన్‌లైన్ షాపింగ్, వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లలో లాగిన్ చేసినప్పుడు యూజర్‌నేమ్ మరియు పాస్‌వర్డ్‌లను నేరుగా మీ మొబైల్ లేదా Gmail లో సేవ్ చేయవద్దు. ఆలా సేవ్ చేస్తే మీ మొబైల్ ఎప్పుడైనా హ్యాక్ కు గురైతే Hacker కు మీ Username మరియు Passwords ఈజీ గా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
- డైరీని మెయింటైన్ చేయండి: మీ యూజర్‌నేమ్‌లు మరియు పాస్‌వర్డ్‌లను ఒక డైరీలో వ్రాసి పెట్టుకోండి. ఇది మీ మొబైల్ హ్యాక్ అయినప్పుడు మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
- బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు: బ్యాంకింగ్ లాగిన్‌లకు సంబంధించిన యూజర్‌నేమ్ మరియు పాస్‌వర్డ్‌లను ఎప్పటికీ సేవ్ చేయవద్దు గుర్తుంచుకోండి.
2. అప్లికేషన్ పర్మిషన్లు మరియు Un-installation Process :-
- అనవసరమైన పర్మిషన్లు ఇవ్వవద్దు: యాప్‌లను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు, కెమెరా, కాంటాక్ట్‌లు, మైక్రోఫోన్ Location వంటి పర్మిషన్లను మీకు అవసరమైతేనే ఇవ్వండి.
- పర్మిషన్లను Check చెయ్యండి : మీరు ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లకు నెలకు ఒకటి లేదా రెండుసార్లు అయినా ఇచ్చిన పర్మిషన్లను చెక్ చేస్తూ ఉండండి. మీరు చాలా రోజుల నుండి ఉపయోగించని యాప్‌లను గమనించి వెంటనే Uninstall చేయండి.
- యాప్‌లను Proper గా Uninstall చేయండి: మీరు ఉపయోగించని యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేసే ముందు, వాటికి ఇచ్చిన పర్మిషన్లను డిసేబుల్ చేయండి, ఆపై యాప్ డేటాను క్లియర్ చేసి (Clear Cache, క్లియర్ డేటా), చివరగా అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
- ఎలా చేయాలి: సెట్టింగ్‌లు > యాప్స్ > యాప్ మేనేజ్‌మెంట్ > యాప్‌ను ఎంచుకోండి > పర్మిషన్లు (డిసేబుల్ చేయండి) > స్టోరేజ్ యూసేజ్ (క్లియర్ క్యాష్, క్లియర్ డేటా చేయండి) > అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
3. పబ్లిక్ వైఫై వినియోగం
- బ్రౌజింగ్ కోసం మాత్రమే: పబ్లిక్ వైఫైని ఉపయోగిస్తున్నప్పుడు, YouTube, Instagram వంటి వాటిని చూడటానికి మాత్రమే ఉపయోగించండి.
- సెన్సిటివ్ టాస్క్‌లు చెయ్యొద్దు: ఇమెయిల్ లాగిన్, బ్యాంకింగ్ లాగిన్‌లు, క్రెడిట్ కార్డ్ లాగిన్‌లు వంటి సున్నితమైన పనులను పబ్లిక్ వైఫైలో చేయవద్దు. ఇది చాలా ప్రమాదకరం మరియు సైబర్ దాడులకు దారి తీసే అవకాశం ఉంటుంది.
4. Webcam భద్రత :-
- అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి: మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో వెబ్‌క్యామ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేయండి, అవసరం లేనప్పుడు Web Cam Disable చేసి ఉంచడం మంచిది.
- స్టిక్కర్ ఉపయోగించండి: ల్యాప్‌టాప్‌లలో ఇన్-బిల్ట్ వెబ్‌క్యామ్‌లకు స్టిక్కర్‌ను అంటించండి. అవసరమైనప్పుడు మాత్రమే స్టిక్కర్‌ను తీసి ఉపయోగించండి.
- మొబైల్ కెమెరా పర్మిషన్లు: మొబైల్ యాప్‌లకు కెమెరా పర్మిషన్లను అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వండి మరియు అవసరం లేనప్పుడు డిసేబుల్ చేయండి.
5. సాఫ్ట్‌వేర్ మరియు యాప్ అప్‌డేట్‌లు :-
- రెగ్యులర్‌గా అప్‌డేట్ చేయండి: మీ మొబైల్ సాఫ్ట్‌వేర్, ఫర్మ్‌వేర్ మరియు అప్లికేషన్‌లను ఎప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండండి.
- బగ్ ఫిక్స్‌లు: అప్‌డేట్‌లు సాధారణంగా బగ్ ఫిక్స్‌లు మరియు భద్రతా మెరుగుదలలను కలిగి ఉంటాయి, ఇవి మీ పరికరాన్ని సురక్షితంగా ఉంచుతాయి.
- ఎలా అప్‌డేట్ చేయాలి: ప్లే స్టోర్ ఓపెన్ చేయండి > ప్రొఫైల్ సింబల్ క్లిక్ చేయండి > మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ > సీ డీటెయిల్స్ > అప్‌డేట్ ఆల్ చేయండి.
6. Data Backup :-
- రెగ్యులర్‌గా బ్యాకప్ తీసుకోండి: మీ మొబైల్ లో ఉన్నటువంటి Important డేటాను క్రమం తప్పకుండా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో బ్యాకప్ చేసుకోండి.
- డేటా రికవరీ: సైబర్ దాడి జరిగినప్పుడు మీ మొత్తం డేటా పోకుండా కొంతవరకు అయినా రికవరీ చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
7. ఈమెయిల్ వినియోగం
- ప్రైమరీ ఈమెయిల్ ఐడిని జాగ్రత్తగా వాడండి: మీ ముఖ్యమైన బ్యాంకింగ్ మరియు ఇతర సున్నితమైన పనులకు మాత్రమే మీ ప్రైమరీ ఈమెయిల్ ఐడిని ఉపయోగించండి.
- సెకండరీ ఈమెయిల్ ఐడిని ఉపయోగించండి: ఒకట్రెండు రోజులు లేదా తాత్కాలికంగా ఉపయోగించే యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లలో లాగిన్ చేయడానికి సెకండరీ ఈమెయిల్ ఐడిని Create చేసుకుని ఉపయోగించడం మంచిది.
సైబర్ దాడి జరిగితే ఏమి చేయాలి?
- మీ మొబైల్ హ్యాక్ అయినట్లు తెలిసిన వెంటనే 24 గంటలలోపు 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. ఇది మీ డేటాను రికవరీ చేయడానికి సహాయపడుతుంది.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు సైబర్ దాడుల నుండి కొంతవరకు అయినా మీ Mobile యొక్క Important డేటా ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. మొత్తంగా చూస్తే, సైబర్ ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతూ ఉన్న నేపథ్యంలో, మన డిజిటల్ లైఫ్‌కి రక్షణ కల్పించడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. సింపుల్ అయినా స్మార్ట్ పద్ధతులను ఫాలో అవుతూ, అప్రమత్తంగా ఉంటే మీరు మీ డేటా, డివైసులను సైబర్ అటాక్స్ నుంచి సేఫ్‌గా ఉంచవచ్చు. సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఆప్షన్ కాదు – అవసరం!
మరింత స్పష్టమైన సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ లోని ఈ వీడియో చూడండి.















