Table of Contents
Motorola Moto G86 Power జూలై 30న లాంచ్ – ఫీచర్లు అదిరిపోయేలా!
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రతి సారి కొత్త ఆవిష్కరణలతో Motorola అభిమానులను ఆశ్చర్యానికి లోన చేస్తోంది. ఈసారి జూలై 30న లాంచ్ కానున్న Moto G86 Power ప్రత్యేకతలు చూసి టెక్ లవర్స్ రోమాంచితులయ్యారు. 6720mAh భారీ బ్యాటరీతో 3 రోజులు నిరంతర యూజ్, 33W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్, 6.7 అంగుళాల Super HD pOLED డిస్ప్లే, శక్తివంతమైన MediaTek Dimensity 7400 5G ప్రాసెసర్ మరియు 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్లో ప్రత్యేక గుర్తింపు పొందనుంది.
మెమరీ & స్టోరేజ్
ఈ ఫోన్లో 8GB RAM + 128GB స్టోరేజ్ లభిస్తుంది. పెద్ద గేమ్స్, సినిమాలు, యాప్స్ అన్నీ సులభంగా స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైతే 1TB వరకు మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే స్టోరేజ్ కొరత అనే మాటే ఉండదు.
డిస్ప్లే స్పెషల్ ఆకర్షణ
6.7 అంగుళాల Super HD pOLED డిస్ప్లే తో Moto G86 Power వచ్చేస్తోంది. ఇందులో 1.5K రిజల్యూషన్, HDR10+, 100% DCI-P3 కలర్ సపోర్ట్, 10-bit డెప్త్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. 4500 nits బ్రైట్నెస్ తో ఎండలో కూడా కంటెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ తో గేమింగ్, స్క్రోలింగ్ అనుభవం సూపర్ స్మూత్‌గా ఉంటుంది.
కెమెరా సెటప్
మోటరోలా ఈసారి కూడా కెమెరా lovers కోసం మస్త్ సెటప్ ఇచ్చింది. 50MP Sony LYTIA 600 మెయిన్ కెమెరా (OIS సపోర్ట్, Moto AI) తో క్లారిటీ ఫోటోలు వస్తాయి. అలాగే 8MP అల్ట్రా వైడ్ + మాక్రో లెన్స్ తో ల్యాండ్‌స్కేప్స్ & క్లోజప్ షాట్స్ అద్భుతంగా తీసుకోవచ్చు. సెల్ఫీ లవర్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా తో 4K వీడియో కాలింగ్, సెల్ఫీలు చాలా క్లియర్‌గా వస్తాయి.
Heavy Battery – Turbo Charging
ఈ ఫోన్లో హైలైట్ చెప్పుకోవాల్సిందే – 6720mAh భారీ బ్యాటరీ. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 3 రోజులు వరకూ యూజ్ చేయొచ్చు. అలాగే TurboPower 33W ఫాస్ట్ ఛార్జింగ్ తో కేవలం కొన్ని నిమిషాల్లోనే ఎక్కువ బ్యాటరీ లభిస్తుంది. గేమింగ్, సినిమాలు, ఆఫీస్ వర్క్ – ఏది చేసినా లోబ్యాటరీ టెన్షన్ లేదు.
ప్రాసెసర్ & పెర్ఫార్మెన్స్
MediaTek Dimensity 7400 (4nm చిప్సెట్) తో Moto G86 Power రాబోతోంది. ఇది 5G స్పీడ్, స్మూత్ మల్టీటాస్కింగ్, ల్యాగ్ఫ్రీ గేమింగ్ అందిస్తుంది. అదనంగా RAM Boost టెక్నాలజీ తో RAM ను 24GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే ఫోన్ ఫ్యూచర్-రెడీగా తయారవుతుంది.
సమగ్రంగా
Motorola Moto G86 Power జూలై 30న లాంచ్ అవ్వబోతోంది. ఈ ఫోన్లో మెగా బ్యాటరీ, ప్రీమియం డిస్ప్లే, అద్భుతమైన కెమెరా, 5G పవర్ఫుల్ ప్రాసెసర్ అన్నీ కలిపి మిడ్-రేంజ్ కేటగిరీలో బలమైన పోటీ ఇవ్వబోతోంది. ఈ లాంచ్ తర్వాత ధర ఎంత పెట్టబోతారు అన్నది మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.















