Find SIMs Linked to Your Name & Remove Unused – Telugu

R V Prasad

By R V Prasad

Updated On:

Sanchar Sathi Telugu

Join Telegram

Join

Join Whatsapp

Join

మీ పేరుతో ఎన్ని SIM కార్డులు రిజిస్టర్ అయ్యున్నాయో మీకు తెలుసా? చాలామందికి ఇదే తెలియదు! ఆధార్ ఆధారంగా ఒక వ్యక్తి పేరు మీద గరిష్ఠంగా 9 SIMల వరకే తీసుకోవచ్చని TRAI నిబంధన. కానీ చాలా సార్లు మనకు తెలియకుండానే ఇతరులు మన పేరు మీద SIM కార్డ్స్ తీసుకుని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యను ఈజీగా చెక్ చేసేందుకు మరియు అదుపు పెట్టేందుకు TAFCOP (Telecom Analytics for Fraud Management and Consumer Protection) అనే గవర్నమెంట్ పోర్టల్ అందుబాటులో ఉంది. ఈ బ్లాగ్‌లో మీ పేరుతో లింక్ అయిన SIMల వివరాలు ఎలా చెక్ చేసుకోవాలి, అవిన్ని వాడుతున్నవేనా లేదా అనేది ఎలా గుర్తించాలి, ఉపయోగించని SIMల్ని ఎలా రిమూవ్ చేయాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మీ పేరు మీద ఎన్ని SIM cards ఉన్నాయో తెలుసుకునే విధానం:

భారత ప్రభుత్వ Sanchar Sathi పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.

🔹 స్టెప్-by-స్టెప్ గైడ్:

  1. 👉 వెబ్‌సైట్‌కి వెళ్ళండి: https://sancharsaathi.gov.in
  2. 👉 హోమ్‌పేజ్‌లో “Know Your Mobile Connections (TAFCOP)” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  3. 👉 మీ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి.
  4. 👉 OTP verification పూర్తయ్యాక, మీ ఆధార్‌/పేరు మీద ఉన్న అన్ని mobile numbers List గా వస్తాయి.

Unused SIM cards deactivate చేసే విధానం:

రెండు పద్ధతుల ద్వారా Deactivation చేయోచ్చు :-

1️⃣ ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయడం (Sanchar Sathi portal నుండే):

మీరు సంచార్ సాథి పోర్టల్‌లో చూసిన జాబితాలో మీకు తెలియని లేదా మీరు ఉపయోగించని నంబర్లు ఉంటే, మీరు వాటిని డీయాక్టివేట్ చేయమని రిక్వెస్ట్ చేయవచ్చు.

  1. పైన పేర్కొన్న విధంగా మీ పేరుపై ఉన్న నంబర్ల జాబితా కనిపించిన తర్వాత, మీరు డీయాక్టివేట్ చేయాలనుకుంటున్న నంబర్ (లేదా నంబర్లు) పక్కన ఉన్న Options ఎంచుకోవచ్చు:
    • ‘Not my number’: ఈ నంబర్ మీది కాదని మరియు మీ అనుమతి లేకుండా తీసుకోబడినదని రిపోర్ట్ చేయడానికి.
  • ‘Not required’: ఈ నంబర్ మీదే అయినప్పటికీ, మీకు ఇప్పుడు అవసరం లేదని మరియు డీయాక్టివేట్ చేయాలనుకుంటున్నారని తెలియజేయడానికి.
  • ‘Required’: ఈ నంబర్ మీదే మరియు మీకు అవసరమని నిర్ధారించడానికి (ఎలాంటి చర్య అవసరం లేదు).
  1. మీరు డీయాక్టివేట్ చేయాలనుకుంటున్న నంబర్‌ను ఎంచుకుని, తగిన కారణాన్ని ఎంచుకున్న తర్వాత, ‘Submit’ లేదా ‘Report’ పై క్లిక్ చేయండి.
  1. మీ అభ్యర్థన Telecom సర్వీస్ ప్రొవైడర్‌కు పంపబడుతుంది మరియు వారు దానిపై చర్య తీసుకుంటారు.

2️⃣ Customer care ద్వారా:

  1. మీరు అదే నెట్‌వర్క్ (Airtel/Jio/VI/BSNL) కస్టమర్ కేర్‌కు కాల్ చేసి,
  2. మీరు చెప్పిన మొబైల్ నెంబర్‌తో సంబంధం లేదని తెలపండి.
  3. వారు KYC చెక్ చేసి, నెంబర్‌ను బ్లాక్ చేస్తారు.

గమనించవలసిన విషయాలు:

మీ పేరుతో అనవసరంగా లింక్ అయిన SIMలు ఉంటే అవి భవిష్యత్తులో మిమ్మల్ని లీగల్ మరియు సెక్యూరిటీ ఇష్యూలకు గురిచేయవచ్చు. అందుకే వెంటనే TAFCOP పోర్టల్‌లో చెక్ చేసి, ఉపయోగించని లేదా అనుమానాస్పదమైన నంబర్లపై చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీ డేటా, డిజిటల్ ఐడెంటిటీని సురక్షితంగా ఉంచాలంటే, ఈ ఒక్క స్టెప్‌ ఎంతో కీలకం!

  • ఒక వ్యక్తి తన ఆధార్‌తో Maximum 9 SIMs మాత్రమే పొందగలడు.
  • మీ పేరు మీద ఉండి, మీరు వాడకపోతున్న నంబర్లు దుర్వినియోగంకు గురయ్యే అవకాశముంది — అందుకే వీటిని డియాక్టివేట్ చేయడం చాలా ముఖ్యం.

R V Prasad

R V Prasad

R V Prasad is the founder and editor of rvprasadtech.com & @rvprasadtech YouTube Channel. He writes daily about Trending Tech New Updates, Railway Updates and trending news in Telugu. With a strong focus on authenticity and public needs, his mission is to make useful information easily available to every reader.

Leave a Comment