Call Forwarding Activation & Deactivation: How to Forward and Stop Calls Easily
Table of Contents
- 1 📞 Call Forwarding అంటే ఏమిటి?
- 2 Call Forwarding రకాలూ
- 3 Call Forwarding ఎలా ప్రారంభించాలి (USSD కోడ్లు ద్వారా)
- 4 Call Forwarding ఎలా ఆపాలి (Deactivation)
- 5 Android ఫోన్లో Call Forwarding
- 6 iPhone లో Call Forwarding
- 7 భారతదేశంలో ప్రధాన నెట్‌వర్క్‌లపై Call Forwarding
- 8 ⚠️ గమనించాల్సిన విషయాలు
- 9 Latest Updates
📞 Call Forwarding అంటే ఏమిటి?
Call Forwarding అనేది ఒక ఫీచర్. మీ ఫోన్‌కి వచ్చే కాల్‌ను మీరు ముందుగా నిర్ణయించిన మరో నంబర్‌కి ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ చేస్తుంది.
ఉదాహరణకు: మీరు ఫోన్ తీసుకోలేని సమయంలో – ఆ కాల్‌ను మీ కుటుంబ సభ్యుల నంబర్‌కి లేదా మీ బిజినెస్ పార్ట్‌నర్ నంబర్‌కి పంపించవచ్చు.
Call Forwarding రకాలూ
| రకం | వివరాలు | ఎప్పుడు వాడతారు |
| Always Forward | అన్ని కాల్స్‌ను వెంటనే ఫార్వర్డ్ చేస్తుంది | ఎప్పుడైనా |
| Forward When Unreachable | ఫోన్ ఆఫ్ లేదా నెట్‌వర్క్ అవుట్‌లో ఉన్నప్పుడు | ఫోన్ అందుబాటులో లేనప్పుడు |
| Forward When Busy | మీ ఫోన్ బిజీగా (ఇతర కాల్‌లో) ఉన్నప్పుడు | లైన్ బిజీగా ఉన్నప్పుడు |
| Forward When No Answer | మీరు కాల్‌కి స్పందించనప్పుడు | మీరు కాల్ తీయనప్పుడు |
Call Forwarding ఎలా ప్రారంభించాలి (USSD కోడ్లు ద్వారా)
మీ ఫోన్ డయలర్‌లో ఈ కోడ్‌లను టైప్ చేసి కాల్ బటన్ నొక్కండి:
| రకం | ప్రారంభం కోడ్ | ఉదాహరణ |
| అన్ని కాల్స్ ఫార్వర్డ్ | **21* మీ ఫోన్ నంబర్# | **21*9876543210# |
| బిజీగా ఉన్నప్పుడు | **67* మీ ఫోన్ నంబర్# | **67*9876543210# |
| స్పందించనప్పుడు | **61* మీ ఫోన్ నంబర్# | **61*9876543210# |
| అందుబాటులో లేనప్పుడు | **62* మీ ఫోన్ నంబర్# | **62*9876543210# |
Call Forwarding ఎలా ఆపాలి (Deactivation)
| రకం | డీయాక్టివేషన్ కోడ్ |
| అన్ని కాల్ ఫార్వర్డింగ్ ఆపు | ##002# |
| బిజీగా ఉన్నప్పుడు ఆపు | ##67# |
| స్పందించనప్పుడు ఆపు | ##61# |
| అందుబాటులో లేనప్పుడు ఆపు | ##62# |
| ఎప్పుడైనా ఫార్వర్డ్ ఆపు | ##21# |
👉 సాధారణంగా ##002# టైప్ చేసి కాల్ చేస్తే అన్ని ఫార్వర్డ్ సెట్టింగ్స్ ఆఫ్ అవుతాయి.
Android ఫోన్లో Call Forwarding
- Phone యాప్ ఓపెన్ చేయండి
- మెనూ (3 డాట్స్) > Settings క్లిక్ చేయండి
- Calling Accounts లేదా Call Settings సెలెక్ట్ చేయండి
- Operater-related settings సెలెక్ట్ చేయండి
- మీ SIM నంబర్ సెలెక్ట్ చేయండి
- Call Forwarding సెలెక్ట్ చేసి రకాల్ని చూడండి
- మీరు కావలసిన నంబర్‌ను ఎంటర్ చేసి enable చేయండి
iPhone లో Call Forwarding
- Settings > Phone > Call Forwarding ఓపెన్ చేయండి
- Call Forwarding ON చేయండి
- ఫార్వర్డ్ చేయాల్సిన నంబర్ ఎంటర్ చేయండి
- ఆపాలంటే toggle off చేయండి
భారతదేశంలో ప్రధాన నెట్‌వర్క్‌లపై Call Forwarding
Jio – **21*నంబర్# ద్వారా Activate చేయవచ్చు
Airtel – USSD కోడ్స్ లేదా Airtel Thanks App ద్వారా
Vi (Vodafone Idea) – USSD కోడ్స్ వాడండి
BSNL – USSD కోడ్స్ (ప్రధానంగా **21*నంబర్# మరియు ##002#)
⚠️ గమనించాల్సిన విషయాలు
- కాల్ ఫార్వర్డ్ చేసే సమయంలో, forwarded call కోసం మీ నంబర్ నుంచే ఛార్జ్ పడుతుంది
- కొన్ని నెట్‌వర్క్‌లు చార్జెస్ తీసుకోవచ్చు
- ఫార్వర్డ్ చేసిన నంబర్ అందుబాటులో లేకపోతే కాల్ లాస్ట్ అవుతుంది















