How to Book Train Tickets from RailOne App in Telugu

R V Prasad

By R V Prasad

Updated On:

railone train reservation process

Join Telegram

Join

Join Whatsapp

Join

రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం ఇకపైనా IRCTC వెబ్‌సైట్‌లో క్యూలో ఉండాల్సిన అవసరం లేదు! ఇప్పుడు కొత్తగా వచ్చిన RailOne యాప్ ద్వారా మీరు తక్కువ సమయంలో, ఏ కష్టపడకుండా మీ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇది IRCTC అధికారిక APIకి లింక్ అయ్యి పనిచేస్తుంది కాబట్టి, పూర్తి సురక్షితంగా, వేగంగా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. Android మరియు iOS రెండింట్లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా జనరల్, తత్కాల్ (Tatkal) టిక్కెట్లు కూడా బుక్ చేయవచ్చు.

RailOne యాప్ ద్వారా రైలు టిక్కెట్లను Book చేసుకునే విధానం

1. RailOne యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి :-

  • మీ మొబైల్ ఫోన్‌లో (Android  కోసం Google Play Store లేదా iOS కోసం Apple App Store) RailOne యాప్‌ను Download  చేసుకోండి.

2. రిజిస్ట్రేషన్ లేదా లాగిన్ :-

  • యాప్‌ను Open చేసిన తర్వాత, మీకు “Login”, “New User Registration”, “Guest” అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • కొత్త వినియోగదారులు (New User Registration) :
    • మీరు IRCTC Rail Connect లేదా UTS యాప్‌లలో ఇప్పటికే ఖాతాలు కలిగి ఉంటే, ఆ లాగిన్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
    • ఖాతాలు లేనట్లయితే, మీ మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
    • మీ పూర్తి పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, యూజర్ ఐడి, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి Sign Up  చేయండి.
    • OTP మరియు MPIN ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుని, ప్రొఫైల్‌లో ఫింగర్ ప్రింట్ లాగిన్ సెక్యూరిటీని కూడా ఆన్ చేసుకోవచ్చు.
  • ఇప్పటికే ఖాతా ఉన్నవారు (Login) :
    • మీ IRCTC/UTS లాగిన్ వివరాలతో లాగిన్ అవ్వండి.
  • అతిథిగా లాగిన్ (Guest) :
    • మీరు వెంటనే టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే, అతిథిగా (OTP ద్వారా) లాగిన్ అవ్వవచ్చు, కానీ పూర్తి సేవలను పొందాలంటే రిజిస్టర్ చేసుకోవడం మంచిది.

3. రైలు టిక్కెట్ బుకింగ్ ప్రక్రియ :-

  • Journey Planner : RailOne యాప్‌లో లాగిన్ అయిన తర్వాత, “Reserved” ఐకాన్‌పై క్లిక్ చేయండి.
  • ప్రయాణ వివరాలు ఎంటర్ చేయండి :
    • మీరు బయలుదేరే స్టేషన్ (From Station) మరియు చేరుకోవాల్సిన స్టేషన్ (To Station) ఎంచుకోండి.
    • మీరు ప్రయాణించాలనుకుంటున్న తేదీని (Journey Date) ఎంచుకోండి.
    • “Search” బటన్‌పై క్లిక్ చేయండి.
  • రైళ్లను ఎంచుకోండి:
    • మీరు ఎంచుకున్న తేదీ మరియు ఆ మార్గంలో అందుబాటులో ఉన్న Train List కనిపిస్తుంది.
    • రైలు నంబర్, పేరు, ప్రయాణ సమయం, మరియు వివిధ కోచ్‌లలో (స్లీపర్, AC, మొదలైనవి) సీట్ల లభ్యతను తనిఖీ చేయండి.
  • సీటును ఎంచుకోండి:
    • మీకు కావాల్సిన కోచ్ మరియు తరగతి (ఉదాహరణకు SL, 3A – 3 టైర్ AC) పైన Click చేయండి.
  • ప్రయాణీకుల వివరాలు ఎంటర్ చేయండి :
    • మీ పేరు, వయస్సు, Gender, ఫోన్ నంబర్ వంటి ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చేయండి.
    • మీరు ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల కోసం బుక్ చేస్తుంటే, వారి వివరాలను కూడా జోడించండి.
    • Review Journey Details పై Click చేయండి.
    • అన్ని వివరాలు check చేసిన తర్వాత Captcha Code ఎంటర్ చేసి Book Now మీద Click చేయండి.
  • Make Payment : 
    • Credit/Debit, Net Banking, UPI లేదా R-Wallet వంటి మీకు నచ్చిన చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి.
    • చెల్లింపు వివరాలను ఎంటర్ చేసి, పేమెంట్ పూర్తి చేయండి.
  • బుకింగ్ నిర్ధారణ :
    • చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత, మీ టిక్కెట్ బుక్ చేయబడిందని నిర్ధారిస్తూ ఒక మెసేజ్ మరియు ఇమెయిల్ అందుకుంటారు.
    • టిక్కెట్ వివరాలను యాప్‌లో చూడవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు.

ముఖ్యమైన చిట్కాలు :

  • ముందుగా ప్లాన్ చేయండి : రైలు టిక్కెట్లు త్వరగా అయిపోవచ్చు, కాబట్టి మీ ప్రయాణానికి ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోవడం మంచిది.
  • Tatkal టిక్కెట్లు : Tatkal టిక్కెట్లు బుక్ చేయాలనుకుంటే, వాటి సమయాలను (AC కోసం ఉదయం 10 గంటలు, Non-AC కోసం ఉదయం 11 గంటలు) గుర్తుంచుకోండి మరియు వేగంగా వివరాలు ఎంటర్ చేయడానికి సిద్ధంగా ఉండండి.
  • R-Wallet : RailOne యాప్‌లోని R-Wallet ఉపయోగించి టిక్కెట్లు కొనుగోలు చేస్తే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లపై 3% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
  • PNR స్థితి : బుక్ చేసిన టిక్కెట్ల PNR స్థితిని కూడా యాప్‌లో తనిఖీ చేయవచ్చు.
  • రైలు స్థానం : రైలు ఎక్కడ ఉందో కూడా ఈ యాప్‌లో చూడవచ్చు.

మొత్తానికి చెప్పాలంటే, RailOne యాప్ అనేది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా మారింది. దీని సులభమైన ఇంటర్‌ఫేస్, ఫాస్ట్ బుకింగ్ ప్రాసెస్ వల్ల ట్రావెల్ ప్లానింగ్ ఇప్పుడు మరింత ఈజీగా మారింది. మీరు తరచూ రైలు ప్రయాణాలు చేసే వారు అయితే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించండి మీ సమయం, శ్రమ రెండింటినీ ఆదా చేసుకుంటారు!

పైన చెప్పిన విదంగా వీడియో రూపం లో చూడలనుకుంటే క్రింద వీడియో లింక్ ఇచ్చాను చుడండి.

R V Prasad

R V Prasad

R V Prasad is the founder and editor of rvprasadtech.com & @rvprasadtech YouTube Channel. He writes daily about Trending Tech New Updates, Railway Updates and trending news in Telugu. With a strong focus on authenticity and public needs, his mission is to make useful information easily available to every reader.

Leave a Comment